ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ విద్యార్థిని ప్రొఫెసర్ వల్ల పడిన బాధ ఆ ఆడియోలో వినిపించంది. ‘నువ్వు నా సోల్‌మేట్.. లైఫ్ పార్ట్‌నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏమిటి సార్? నా వయస్సు 23 ఏళ్లు.. నాకు తెలిసి మీ పిల్లలకూ ఇదే వయస్సు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా... ఎందుకు ఫోన్ చేస్తున్నారు? రెస్టారెంట్లు, బీచ్‌కు రావాలని అడుగుతారా? నీ రూమ్‌లో ఏసీ లేదుగా.. నా రూముకు రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్..
నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నంబరును బ్లాక్ చేస్తే.. మరో నంబరు నుంచి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానసికంగా వేధించడం వల్ల కొన్ని నెలలుగా పుస్తకాలు తెరవలేదు. విధులు నిర్వహించినా.. సంతకం పెట్టలేదు.. సార్.. అంటూ ఆ విద్యార్థిని ప్రొఫెసర్ వేధింపులపై ఆవేదనగా మాట్లాడింది. ఈ ఆడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. చివరకు జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
నెల్లూరు జీజీహెచ్‌లో ఇలాంటి వేధింపుల ఘటనలు కొత్త కాదు.. రెండేళ్ల కిందట కూడా ఓ వైద్య విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగుచూసింది. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు ఆయనపై దాడి చేశారు. ఆ అధ్యాపకుడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. విచారణ కమిటీ వేసింది. ఆ ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి