ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజు రోజుకి క‌రోనా వ్యాప్తి చాలా తక్కువగా కొన‌సాగుతుంది.ఇక కేసులు 5000 కంటే తక్కువగా నమోదవ్వడం ఊరట కలిగించే విషయం.ఇక కొత్త‌గా ఆంధ్రాలో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో చూసుకున్నట్లయితే మొత్తం 87756 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా మొత్తం 4549 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇక దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,14,393కు చేరింది. ఇక మరణాల విషయానికి వస్తే మ‌రో 59 మంది క‌రోనా వైరస్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఫ‌లితంగా మొత్తం కరోనా మ‌ర‌ణాల సంఖ్య  11,999 కు చేరింది.


అలాగే రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి మరో 10,114 మంది బాధితులు రికవరీ అయ్యారు. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి దాకా 17,22,381 మంది బాధితులు కొలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 కరోనా వైరస్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,05,38,738 కరోనా నమూనాలను ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ పరీక్షించింది. ఇక చిత్తూరు జిల్లాలో 860 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 619 కరోనా కేసులు నమోద‌య్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 529 కరోనా కేసులు, అలాగే వైఎస్సార్ కడప జిల్లాలో 412 కరోనా కేసులు వెలుగుచూశాయి.


ఇక కొత్త‌గా చనిపోయిన వారి సంఖ్య చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కోల్పోయారు.కేసులు ఇలా రోజు రోజుకి తగ్గుముఖం పడుతుండటం నిజంగా ఊరట కలిగే విషయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: