ఎన్నో కష్టాలు, నష్టాలు వచ్చిన రైతు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు  దేశానికి అన్నం పెట్టాలి అనే పట్టుదలతో కష్టనష్టాలను ఓర్చుకుంటూ మళ్ళీ పంట పొలంలో దిగి కష్టపడుతూనే ఉన్నాడు రైతు. అయితే దేశం కోసం కష్టపడుతున్న రైతన్నకు అటు ప్రకృతి సైతం సహకరించక ఎన్నోసార్లు నష్టాల పాలవుతున్నాడు. అదే సమయంలో అటు కేటుగాళ్లు కూడా కష్టాల నష్టాల పాలు చేస్తూనే ఉన్నారు. ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండిస్తే ఇక నకిలీ విత్తనాలు కారణంగా కనీసం పంట కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నకిలీగాళ్ళ బెడద రైతులకు శాపంగా మారిపోతుంది.



 ఇక రోజురోజుకు నకిలీ విత్తనాలు యదేచ్చగా మార్కెట్లో అమ్ముతున్నారు కేటుగాళ్లు. దీంతో రైతులు కేటుగాళ్ల మాయ మాటలు నమ్మి చివరికి పూర్తిగా నష్టాల్లో కూరుకు పోతున్నారు. ఇక ఇటీవలే తెలంగాణ ఏపీ కర్ణాటకలో నకిలీ విత్తనాలు, పురుగుమందులు, గుట్కా, పాన్ మసాలా లు లాంటివి తయారు చేస్తున్న ముగ్గురు కేటుగాళ్ళను అరెస్టు చేశారు పోలీసులు  వీటి తయారీకి ఉపయోగించే 683 సిలిండర్లను,, మిషనరీ సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇక ఈ కేటుగాళ్ల వద్ద దొరికిన సామాగ్రి విలువ రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు.



 అయితే ఇక ఇటీవలే పట్టుబడిన వారిలో బడాబడా కేటుగాళ్ళు  ఉన్నట్టు తెలుస్తుంది  నిందితుల్లో కపిశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ సీఈఓ సురేష్ బొగడ కాగా.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం జైలుప్పాలా గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, పెద్ధతిమ్మయ్య లు మరో ఇద్దరు   ఇక బొగుడ సురేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇటీవలికాలంలో   ఇలా నకిలీ విత్తనాలు తయారు చేసిన కేటుగాళ్లు ఆగడాలు బయటపడుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతాంగాన్ని ఆదుకోవడానికి నకిలీ విత్తనాల విషయంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడితే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: