
ఏపీలో జగన్ పాలన ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.. జగన్ దగ్గర మంచి మర్యాదలు అస్సలు ఉండవ్. వకీల్‌సాబ్‌కు అలా హిట్ టాక్ వచ్చిందో లేదో సినిమా థియేటర్ల టిక్కెట్ రేట్లు రు. 5కు వెళ్లిపోయాయి. పైగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే హీరోలు ఉన్నది మెగా ఫ్యామిలీలోనే.. చిరంజీవికి ఇటు సినిమా అవసరాలే కాకుండా రాజకీయ అవసరాలు కూడా ఉన్నాయి. రాజకీయంగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరిక ఉంది. అయితే అది జనసేన ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సుతరామూ ఇష్టంలేదా ? అన్న డౌట్ కూడా ఉంది. తమ్ముడు తనకు తానే ఏం చేసుకోలేకపోయాడు.. ఇక అన్నకు ఏం చేస్తాడు ? ఏం పదవి ఇప్పిస్తాడు ?
కట్ చేస్తే జగన్ కాపులకు ఓ రాజ్యసభ ఇవ్వాలనుకుంటున్నాడని... అందుకు చిరు పేరు కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల ముందే చిరు తన సతీమణి సమేతంగా జగన్ ఇంటికి వెళ్లి మరీ భోజనం చేసి వచ్చాడు. అప్పుడు జగన్, ఆయన సతీమణి భారతి సైతం చిరు దంపతులను సాదారంగా ఆహ్వనించి దగ్గరుండి సకల సంప్రదాయాలతో, షడ్రుచులతో భోజనం పెట్టించి పంపించారు. ఆ తర్వాత వీలున్నప్పుడల్లా చిరు జగన్ భజన చేస్తూనే వస్తున్నారు. తాజా భజనలో జగన్ ప్రభుత్వం ఒక్క రోజే 13.72 లక్షల మందికి టీకాలు వేసింది.
దీనిని కీర్తిస్తూ చిరంజీవి తన ట్విట్టర్‌లో చెలరేగిపోయారు. ఒక్క రోజులో ఏపీ ఆరోగ్య బృందాలు ఇంతమందికి టీకా వేయడం చాలా ఆనందంగా ఉంది. కోవిడ్‌ను తరిమి కొట్టేందుకు మీరు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి. ఇది మీ సమర్థ నాయకత్వానికి నిదర్శనం.. మీరు మరింత ముందుకు వెళ్లాలని చిరు ట్వీట్ చేశారు. చిరు అభినందల మాలలు చూస్తోన్న వారు రాజ్యసభ పదవి కోసం పడుతోన్న కాకానా ? అన్న చిన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్ మదిలో ఏముందో ? జగన్‌కే కదా తెలిసేది.