ఏపీ సీఎం చంద్ర‌బాబు 2024 ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ ప్రారంభించేశారు. మొత్తం 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఇన్‌చార్జ్‌లు లేరు. దీంతో ఈ ఇన్‌చార్జ్‌ల‌ను భ‌ర్తీ చేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ అక్టోబ‌ర్ నాటికి ఏపీలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌లు లేని నియోజ‌క‌వ‌ర్గం ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి స‌మ‌ర్థులు అయిన నేత‌ల‌ను ఎంపిక చేస్తూ వ‌స్తున్నారు. ఇక చాలా మంది నేత‌లు అధికార పార్టీ పెట్టే కేసులు, ఒత్తిళ్లు.. వ్యాపార ప‌ర‌మైన టార్గెట్ల‌కు భ‌య‌ప‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం లేదు స‌రిక‌దా.. అస‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేదు.

మ‌రో వైపు చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు జూమ్ మీటింగ్‌లు పెడుతూ పార్టీ నాయ‌కులు, కేడ‌ర్‌కు ధైర్యం నూరి పోస్తున్నారు. మీరు అది చేయాలి. ఇది చేయాల‌ని చెపుతున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు మైండ్ బ్లాక్ అయిపోయే రిపోర్టు చేరింద‌ట‌. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంద‌ని ఆయ‌న రాబిన్ శ‌ర్మ టీంతో పాటు పార్టీలో కోర్ క‌మిటీ టీంతో ఓ స‌ర్వే చేయించార‌ట‌. ఈ స‌ర్వేలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 నియోజ‌క‌వర్గాల్లో పార్టీ నేత‌లు పార్టీని ప‌ట్టించుకో వ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ జ‌నాల్లోకి వెళ్ల‌డం అనే విష‌యాన్నే మ‌ర్చిపోయార‌ట‌.

పైగా వీరు ఎన్నిక‌ల‌కు మరో మూడేళ్లు ఉంది. ఈ టైంలో బ‌య‌ట‌కు వెళితే అన‌వ‌స‌రంగా చేతి చ‌మురు వ‌దులుతుంది. ఉప‌యోగం ఉండ‌ద‌న్న నిర్ణ‌యంతో ఉన్న‌ట్టు కూడా బాబు వ‌ద్ద‌కు చేరింద‌ట‌. ఈ క్ర‌మంలో ఇదే ప‌రిస్థితి ఉంటే పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా విజయం సాధించ‌డం క‌ష్ట‌మే అని డిసైడ్ అయిన బాబు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే /  ఇన్‌చార్జ్‌తో మాట్లాడుతూ .. వారి అవ‌స‌రాలు ఏంటో తెలుసుకోవాల‌ని కూడా నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నేత‌ల ప‌ని తీరు నివేదిక‌తో చంద్ర‌బాబు గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతోన్న మాట అయితే వాస్త‌వం. మ‌రి వీరిని ఎలా యాక్టివ్ చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: