నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృష్టంతా దక్షిణ భారతదేశం పైనే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా దేశంలో బీజేపీ తన ప్రాభవాన్ని కొనసాగిస్తుంటే దక్షిణ భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే కల మాత్రం నెరవేరలేదు. దీనికోసం గత ఎన్నికలలో కూడా కుటిల వ్యూహాలను అమలు పరిచి కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, మిగిలిన తమిళనాడు, ఏపీ, తెలంగాణ మరియు కేరళలో తన పాచికలు పారలేదు. కేవలం ఒక్క కర్ణాటకలోని అధికారంలో కొనసాగుతోంది. ఇక్కడ కూడా ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. రానున్న ఎన్నికల్లో అయినా దక్షిణ భారతదేశంలో తమ ఆధిక్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ఇదిలా ఉంటే కర్ణాటక సీఎంగా ఉన్న యడ్డ్యూరప్ప నిన్న కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాజీనామా చేశారు. దీనితో తరువాత సీఎంను నియమించే ఆలోచనలో నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం కేంద్ర మంత్రులయిన కిషన్ రెడ్డి మరియు ధర్మేంద్ర ప్రధాన్ లను ఇవాళ కర్ణాటక పంపించింది. వీరిద్దరూ తదుపరి సీఎంను ఎన్నుకునే ప్రక్రియలో కాసేపటి క్రితమే బెంగుళూరు లోని క్యాపిటల్ హోటల్ లో సమావేశం అయ్యారు. ఇప్పుడు కర్ణాటక బీజేపీ పార్టీలో సీఎం పదవి కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువ గానే ఉంది.

అయితే అటు కర్ణాటక రాజకీయ విశ్లేషకులు మాత్రం వీరిలో ఒకరిపైనే మొగ్గుచూపుతారని అనుకుంటున్నారు. అయితే అతనెవరో కాదు కర్ణాటక మాజీ సీఎం సోమప్ప రామప్ప బొమ్మై కుమారుడు బసవరాజు బొమ్మై అని అనుకుంటున్నారు. దీనికి రెండు బలమైన కారణాలున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడ్డ్యూరప్ప కూడా ఇతని పేరును సూచించినట్లు సమాచారం. మరియు ఇతను కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా కలిసొచ్చేలా ఉంది. అందరూ ఊహించినట్టే మాజీ సీఎం కొడుకునే కర్ణాటక సీఎం పదవి వరించింది. ఇప్పుడు యడ్డీ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరోసారి లింగాయత్ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తిని సీఎంగా నియమించి సెంటిమెంటును కొనసాగించింది. మరి బసవరాజ్ బొమ్మై ఏ విధముగా తన పాలనను సాగించనున్నాడో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: