జగన్ సర్కార్ పై టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు.  ఐపిఎస్ లు బరితెగించి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని..
వైసిపి అధికార ప్రతినిధుల కంటే ఎక్కువగా  ఐపిఎస్ లు మాట్లాడారని మండిపడ్డారు.  పోలీసులు వాస్తవాల ను వక్రీకరించి మాట్లాడుతున్నారని.. పోలీసులు జోగి రమేష్ తో పోలీసులు కుమ్మక్కైయ్యారని ఆరోపణలు చేశారు.  గుంటూరు ఐపిఎస్ లు ఖాకీ డ్రస్స్ కు కళంకం తేస్తున్నారని.. మీరు ఖాకీ డ్రస్స్ లు వదిలి వైసిపి చొక్కాలు వేసుకుంటే బాగుంటుందని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  


వైసిపి నేతలతో పోలీసులు కుట్ర పన్ని చంద్రబాబు ఇంటి పై దాడి చేయించే ప్రయత్నం  చేస్తున్నారని నిప్పులు చెరిగారు.   ఎస్పీ అమ్మి రెడ్జి తో మాపై ఫిర్యాదు చేయించ కుండా ఓ చిన్న ఏఎస్ఐ ని ఎందుకు బలి చేస్తున్నారని మండిపడ్డారు.  పోలీసులు వైసిపి నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంటూరు జిల్లా లో అసలు పోలీసు వ్యవస్థ పని చేస్తుందా అనే అనుమానం కలుగుతుందన్నారు. సీతానగరం గ్యాంగ్ రేప్ ఘటనలో ఇంకా నిందితులను పూర్తి పట్టు కోలేదని ఫైర్ అయ్యారు.  

పాలడుగు సామూహిక అత్యాచారం జరిగి రెండు వారాలు గడుస్తున్న చర్యలు శూన్యం అని పేర్కొన్నారు.  గుంటూరు జిల్లాలో పోలీసులు అధికారి పార్టీ నేతలకు దాసోహం అంటున్నారని.. గుంటూరు జిల్లా లో పోలీసు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. గుట్కా వ్యాపారాలకు గుంటూరు జిల్లా నిలయంగా మారిందని.. జిల్లా లో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తు న్నాయని పేర్కొన్నారు.  తెలంగాణ మద్యం ఏరులై పారుతుందని.. గుంటూరు జిల్లా లో  గంజాయి దొరకని ప్రాంతంలేదన్నారు.  గుంటూరు డిఐజీ, ఇద్దరు ఎస్పీలు నిద్రపోతున్నారా....? ఈ ముగ్గురు ఐపిఎస్ లకు అక్రమ వ్యాపారస్తుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందయని మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: