మరికొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ పర్యటనలు పెట్టుకున్నా .. ఎమ్మెల్యేలు తమ కేడర్‌ను కంట్రోల్ చేస్తు న్నారు. దీంతో ఎంపీ తీవ్ర సంకట స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ నియోజకవర్గం పరిధిలో చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట అసెంబ్లీ నియజకవర్గాలు ఉన్నాయి. వీటిలో నరసరావుపేట, సత్తెనపల్లి మినహా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎంపీకి సెగలు పుడుతున్నాయి. ఆయా నియోజకవర్గాలకకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీకి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని.. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని.. పెద్ద ఎత్తున పార్టీలోనే చర్చ సాగుతుండడం గమనార్హం.
నిజానికి ఆదిలో బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఎందుకు తేడా వచ్చిందనేది ఆశ్చర్యంగా ఉంది. దీనికి ప్రధాన కారణం.. గతంలో కకరోనాకు ముందు.. కేంద్ర ప్రభుత్వం.. ఎంపీలాడ్స్ నిధులు ఇచ్చింది. దీనిని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా వెచ్చించారు లావు. అయితే.. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా కేంద్రం ఎంపీలాడ్స్‌ను కేంద్రం నిలిపి వేసింది. దీంతో ఇప్పుడు ఆయన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేక పోతున్నారు. అయితే.. ఈ సమస్య ఒక్క లావుకే కాదు..దేశవ్యాప్తంగా అందరు ఎంపీలకు ఉంది.
కానీ, లావు మాత్రం.. ఇక్కడ పనులు చేయలేక పోవడంతోపాటు.. తనకు అందుతున్న ఫిర్యాదులపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నారనే వాదన ఒకటి ఉంది. మరోవైపు ఆధిపత్య రాజకీయాలు కూడా లావును ఇరకాటంలోకి నెడుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా.. నరసరావు పేట ఎంపీకి సొంత పార్టీలోనే సెగలు పుట్టడం.. నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి