తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాని లేదా భారతీయ జనతా పార్టీ గాని బలపడితే కచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి. రాజకీయంగా సీఎం కేసీఆర్ కు ఇప్పటివరకు ఇబ్బందికర పరిస్థితులు లేకపోయినా కచ్చితంగా భవిష్యత్తులో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా దళిత ఓటు బ్యాంకును అలాగే మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఈ మధ్యకాలంలో దళిత నాయకులతో ఎక్కువగా సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు వేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కీలక నాయకులు టిఆర్ఎస్ పార్టీ లోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారని నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎంపీ గారి కోసం గట్టిగా కష్టపడ్డారని ప్రచారం జరిగింది. కానీ ఆ ఎంపీ గారు మాత్రం కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు రావడానికి ఇష్టపడడం లేదని రాహుల్ గాంధీ నుంచి స్వయంగా హామీ ఉండటంతో ఆయన నమ్మకం గా ఉన్నారని అంటున్నారు.

దీంతో సీఎం కేసీఆర్ అనుకున్న విధంగా పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో లేవని టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి వాళ్ళు ఎవరూ కూడా సుముఖంగా లేరని అలాగే క్షేత్ర స్థాయి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం పెంచుకుందని అంటున్నారు. సీఎం కేసీఆర్ కు గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటపడక పోవడం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బయటకు రావడానికి ఆసక్తి చూపించడం లేదని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr