ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తే మహిళలని కూడా చూడకుండా పోలీసులతో కొట్టిస్తారా అని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ మధ్య టీఆర్‌ఎస్‌ సభకు వెళ్లి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని అడిగితే తనను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారని ఓ మహిళ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆడిగినందుకే తనపై పోలీసులు దాడి చేసి కొట్టారని పేర్కొన్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి నోటికొచ్చినట్లు దుర్భాషలాడినట్లు రేవంత్ రెడ్డికి ఆ మహిళ వివరించింది.


రేవంత్ రెడ్డికి ఆ మహిళ ఫోన్ చేసి తన పరిస్థితి వివరించింది. అసలేం జరిగిందో చెప్పింది. తెలంగాణ కోసం దెబ్బలు తిని జైలుకు పోయిన యువతకు స్వరాష్ట్రంలో ఉద్యోగాలు అడిగే హక్కు లేదా.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అడిగితే పోలీసులతో దాడులు చేయించారని వాపోయింది. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే పోలీసులు దాడి చేశారని చెప్పింది.  పోలీసుల దాడిలో గాయపడిన ఆడబిడ్డకు అండగా నిలుస్తానని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చాడని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.


పోలీసులు తనపై దాడి చేయడంతోపాటు దుర్భాషలాడరని ఆరోపిస్తున్న మహిళతో ఫోన్లో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అండగా ఉండదని  భయపడవద్దని మహిళకు పీసీసీ అధ్యక్షుడు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చుని.. హైదరాబాద్ రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు.


హైదరాబాద్‌ వచ్చి తనను కలిస్తే.. ఇద్దరం కలిసి ఎన్నిక ప్రధాన కమిషనర్ ను నేరుగా కలిసి ఫిర్యాదు చేద్దామని రేవంత్ రెడ్డి సూచించారు. ఎన్నికల సమయంలో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్న రేవంత్ రెడ్డి ఈ ఇష్యూని ఎలా హైలెట్ చేస్తారో చూడాల్సిందే. టీఆర్ఎస్ సర్కారు మహిళలపైనా దాడులు చేయిస్తోందని.. నోరు తెరిచి ప్రశ్నిస్తే దాడులు చేయిస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఘటనను రేవంత్ రెడ్డి ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: