జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంతో 47.4 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చూకూర‌నుంద‌ని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. గురువారం ఆయ‌న స్పందనపై వీడియో కాన్ఫ‌రెన్స్ తో పాటు జ‌గ‌న్ అన్న సంపూర్ణ గృహ‌హ‌క్కు ప‌థ‌కంపై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా మాట్లాడారు. నెల్లూరులో చోటుచేసుకున్న ఘ‌ట‌న త‌న‌దృష్టికి వ‌చ్చింద‌ని.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పాన‌ని తెలిపారు. ఎంప్యానెలైన‌ కంపెనీల‌కు ఉత్పత్తుల‌ను మాత్ర‌మే ఇవ్వాల‌ని, సీడ్ కార్పొరేష‌న్ వీటిని ప‌రిశీలించాల‌ని సూచించారు.
 
అదేవిధంగా ఆర్‌బీకేల ద్వారా ఇస్తున్న వాటికి ప్ర‌భుత్వం గ్యారెంటీ ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. విత్త‌నాలు, ఎరువులు, పురుగ‌లమందులుంచ‌డానికి ఆర్బీకేలోని గోడౌన్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. స్టోరేజీ చేయ‌డానికి అద్దెప్రాతిప‌దిక‌న భ‌వ‌నాలు తీసుకోవాల‌ని సూచించారు. ఆర్బీకే ద్వారా విత్త‌నాలు, ఎరువులు, పురుగుల మందులు స‌ర‌ఫరా చేయాల‌ని చెప్పారు. ఆర్బీకే విధులు,కార్య‌క‌లాపాల‌పై క‌లెక్ట‌ర్లు నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని కోరారు. ఆర్‌బీకేల‌లో బ్యాంకింగ్ క‌ర‌స్పాండెంట్‌లు ఉండేవిధంగా చూడాల‌న్నారు. ఇప్ప‌టికే కౌలురైతుల‌కు సీసీఆర్‌సీ కార్డులు ఇచ్చాం అని.. పంట రుణాలు అందేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. న‌వంబ‌ర్ నుంచి ర‌బీ ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని.. ర‌బీకి అవ‌స‌ర‌మైన‌వ‌న్ని అధికారులు సిద్ధం చేయాల‌ని చెప్పారు. 


దాదాపు 62 శాతం ప్ర‌జ‌లు ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా వ్య‌వ‌సాయం పైన ఆధార‌ప‌డ్డార‌ని..అన్నిరంగాల‌కెల్లా ఈరంగం ఎంతో ప్రాధ‌న్య‌మ‌ని వివ‌రించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ మొత్తం దీనిపైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వెల్ల‌డించారు సీఎం. జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూ హ‌క్కు, భూర‌క్ష‌ప‌థ‌కం ఎంతో గొప్ప‌ద‌ని వివ‌రించారు. దీని ద్వారా గ్రామాల్లో నెల‌కొనే భూవివాదాల‌కు పూర్తిగా చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యంలో స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యం ఉంటుంది. తొలుత ఇది 51 గ్రామాల్లో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రూపొందుతుంది.  డిసెంబ‌ర్‌లో 650 గ్రామాలు.. 2023 జూన్ వ‌ర‌కు రాష్ట్రవ్యాప్తంగా ఇది అమ‌లు అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. స‌ర్వే పూర్తికాగానే రికార్డులు అటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయ‌ని.. కొత్త‌పాసుబుక్‌ల‌ను య‌జ‌మానుల‌కు అందజేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. 47.4ల‌క్ష‌ల మంది ల‌బ్దిపొందుతున్నార‌ని తెలిపారు. ఈప‌థ‌కంపై సీఎస్ కూడ ప్ర‌త్యేకంగా రివ్యూ చేస్తాడ‌ని వివ‌రించారు.





మరింత సమాచారం తెలుసుకోండి: