
దీనికి కారణం.. చంద్రబాబు సతీమణిపై.. అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి కుటుంబం స్పందిం చింది. అదేసమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. అయితే.. ఈ ఎపిసోడ్‌లో ఆయన ఎవరిపైనా పరుష వ్యాఖ్యలు చేయలేదు. ఎవరినీ తిట్టలేదు. దీంతో జూనియర్ నుంచి ఏదో ఆశించి.. మైలేజీపై ఆశలు పెట్టుకున్న టీడీపీ .. జూనియర్‌ను టార్గెట్ చేయించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటివారు.. జూనియర్‌ను తిట్టిపోశారు. ఇదేనా నందమూరి వారసుడిగా.. నువ్వు మాట్లాడేది.. నువ్వు ముసలాడివా.. నీలో చేవ చచ్చిందా? అంటూ.. వర్ల నిలదీశారు.
ఇక, బుద్ధా కూడా.. నీకు నందమూరి కుటుంబం గురించి మాట్లాడే అర్హత పోయిందన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ అభిమానులు సీరియస్‌గా స్పందిస్తున్నారు. మీరు మాకు ఏం చేశారని.. జూనియర్‌ను అంటున్నారు? గతంలో ఆయనను వాడుకున్నారు. మళ్లీ పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి.. ఆయనను రొచ్చులోకి లాగి.. వైసీపీకి ద్రోహిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ.. మండిపడుతున్నారు.
ఈ క్రమంలో జూనియర్ అభిమానుల ఆగ్రహాన్ని గుర్తించిన.. టీడీపీ సీనియర్లు.. మనవాళ్లు అలా అని ఉండాల్సింది కాదు.. దీనివల్ల మన పార్టీకి మైలేజీ మాటేమో.. కానీ.. జూనియర్ అభిమానులు ఉద్యమాలకు దిగితే.. ఎలా రియాక్ట్ కావాలి? వారు ఆగ్రహించి వచ్చే ఎన్నికల్లో పార్టీకి దూరంగా ఉంటే.. ఏం చేయాలి? అప్పుడు మళ్లీ జూనియర్‌ను బ్రతిమాలుకోవాల్సిందే.. కదా!! ఎందుకు ఈ తప్పులపై తప్పులు.. అని చర్చించుకోవడం గమనార్హం. మొత్తానికి .. వర్ల.. బుద్దా వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చే సాగుతోంది. వీరి వ్యాఖ్యలు మైలేజీ కన్నా..డ్యామేజీనే ఎక్కువ చేయడం ఖాయమని నాయకులు అంటున్నారు.