ఇలా గత కొంత కాలం నుంచి చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోయింది. ఈ క్రమం లోనే ఇక ప్రపంచ దేశాలు చైనా తీరుపై గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమం లోనే వరుసగా అన్ని దేశాలు చైనా కు షాక్ ఇస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అగ్ర రాజ్యమైన అమెరికా చైనా లోని బీజింగ్ లో జరగబోయే ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇప్పటికే అమెరికా బ్రిటన్ కెనడా లాంటి దేశాలు బీజింగ్లో ఒలంపిక్స్లో దౌత్య పరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసి చైనాకు షాక్ ఇచ్చాయి.
ఇక ఇప్పుడు ఈ లిస్టు లో కి జపాన్ కూడా వచ్చి చేరింది. అగ్ర రాజ్యాలైన బ్రిటన్ అమెరికా చైనాలోని బీజింగ్లో జరగబోయే ఒలింపిక్స్ ను దౌత్య పరంగా ఆవిష్కరించినట్టుగానే ఇక ఇప్పుడు జపాన్ కూడా ఇదే తరహాలో దౌత్యపరంగా బీజింగ్ ఒలంపిక్స్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతో చైనాకు ఊహించని షాక్ తగిలింది. ఇక రానున్న రోజుల్లో మరిన్ని దేశాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇలా ఒలంపిక్స్ ను బహిష్కరిస్తూన్న దేశాలపై చైనా మాత్రం గుర్తు గా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి