
కార్పొరేషన్ మేయర్ అభ్యర్ధిగా కేశినేని కుమార్తె శ్వేతని ప్రకటించడంతోనే ఈ రచ్చ అంతా వచ్చింది. పైగా కేశినేని డైరక్ట్‌గా...బుద్దా వర్గంపై విమర్శలు చేశారు. అటు వాళ్ళు కూడా తీవ్రంగానే స్పందించారు. ఇలా గ్రూపు గొడవలు జరిగాయి...దీంతో కార్పొరేషన్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే అక్కడ నుంచి రచ్చ సైలెంట్‌గానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. పైగా విజయవాడ వెస్ట్ సీటు విషయంలో ఏదొక రచ్చ వస్తూనే ఉంది. ఈ సీటు కోసం ఓ వైపు నాగుల్ మీరా ట్రై చేస్తున్నారు...అటు బుద్దా వెంకన్న కూడా వస్తే తనకు లేదా మీరాకు రావాలని అన్నట్లు కాచుకుని కూర్చున్నారు. కానీ చంద్రబాబు తాజాగా ఎవరికి కాకుండా ఎంపీ కేశినేని నానిని సమన్వయకర్తగా నియమించారు. అంటే ఇంచార్జ్‌ని మాత్రం పెట్టలేదు. దీంతో ఇక్కడ ఒక విషయం తేల్చేసినట్లు అయింది. నెక్స్ట్ ఎన్నికల్లో పొత్తులు, రాజకీయ పరిస్తుతులని బట్టి అభ్యర్ధిని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే కేశినేనికి బాధ్యతలు అప్పగించడంతో బుద్దా వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది...ఇప్పటికే నగరంలో కేశినేనికి ప్రాధాన్యత పెరిగిపోతుందని, చంద్రబాబు కూడా ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు రగిలిపోతున్నారు. ఇక పరిస్తితి కాస్త అటు ఇటైన...వెస్ట్‌లో దెబ్బ వేసేలా ఉన్నారు. అక్కడ ఎవరికి సీటు ఇచ్చిన పరోక్షంగా దెబ్బవేసేలా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా అదే చేశారు. మరి ఈ వెస్ట్ రచ్చ ఎంతవరకు వెళుతుందో చూడాలి.