ముందస్తు ఎన్నికలు.. ఇది.. రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం. జగన్ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందని టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఊహాగానాలకు ఆధారం ఏంటో తెలియదు కానీ.. ఈ ప్రచారంతో టీడీపీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంటోంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఎప్పుడు మళ్లీ సీఎంగా చంద్రబాబును చూస్తామా అన్న ఆశ టీడీపీ శ్రేణులకు ఉంటే.. అదే తరహా ఆలోచన అధినాయకుడిది కూడా.


అయితే.. ఆ ఆశలపై జగన్ దూత.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నీళ్లు జల్లేశారు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని ప్రకటించేశారు. మేము ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతాం అని ప్రశ్నించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజలు మాకు 5ఏళ్లు మాకు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజలు  ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని.. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చి చెప్పారు.


కేంద్రం నుంచి ఆదేశాలు ఏదైనా ఉంటే తప్ప రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంపై చంద్రబాబు నిందలు వేస్తూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వంపై చంద్రబాబు విషం కక్కడం ఎక్కువైందని అన్నారు. ఏ ఆధారంతో చంద్రబాబు మాట్లాడుతున్నారో తెలియడం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇకపై అన్నిచోట్లా  ఢీ అంటే ఢీ అనే వ్యక్తులకు సీట్లిస్తానని చంద్రబాబు అంటున్నారని.. అలాగైతే తొలుత కుప్పంలో అభ్యర్థిని మార్చాలని సెటైర్‌ వేశారు.


కుప్పంలో టీడీపీ అడ్రస్ లేకుండా పార్టీ పోయిందన్న సజ్జల.. సొంతంగా ఎన్నికలకు వెళ్లి తెదేపాకు ఒటు వేయాలని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని గుర్తు చేశారు. చంద్రబాబు ఎవరివో ఒకరి కాళ్లు పట్టుకుని ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారని.. అలాంటి విష సంస్కృతి,దుష్ట సాంప్రదాయాలు,సంస్కృతికి  సీఎం జగన్ పోవడం లేదని సజ్జల అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: