33 ఏళ్ల క్రితం 200 మంది సమక్షంలో పార్టీ పెడుతున్నామని ప్రకటించినప్పుడు అది తెలుగునాట ప్రభంజనం సృష్టించనుందని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఇలా పార్టీ పెట్టడం ఏంటి 9నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారికి చెల్లుతుంది. తెలుగు నేలమీద మరెవరికీ సాధ్యం కాని చరిత్రని సృష్టించిన యుగపురుషుడు. పార్టీ పెట్టడమే కాదు అడ్డగోలుగా దోచుకో తినే వారికి వ్యతిరేకంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా సాగింది అన్న గారి పాలన. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే విధంగా ఆచరించి చూపించారు ఎన్టీఆర్.
 అలాంటి ఆయన పేరు చెప్పుకొని కాయల అమ్ముకోవాలని అనుకుంటున్న ఆయన రాజకీయ వారసులకు చెంపపెట్టులా తయారయ్యారు. తెలుగుజాతి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో ఘోర పరాభవాన్ని గురవుతున్న రోజులవి. ఆయన గుండె మండిపోయింది ఢిల్లీ అహంకారంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసింది. తెలుగుదేశం రూపంలో ప్రజల్లోకి వెళ్లింది. తాతల నాటి చరిత్ర లేదు తండ్రుల నాటి సంపద లేదు. ఒకే ఒక్కరు ప్రజల కోసమై ఎన్నో ఆటుపోట్లను ఎదిరించి ముందుకొచ్చాడు. ముఖానికి రంగు పూసుకుని వాళ్ళకి రాజకీయాలు ఏం అవసరమని చీటి పోటీ మాటల మధ్య ఆయన అనుకున్న ఆలోచనలు ఆచరణలో పెట్టాడు. కుట్రలు కుతంత్రాలు తెలుగు వాడి వేడి ఢిల్లీకి చూపించాడు. వెండితెర మీద తిరుగులేని నటుడు. లక్షల్లో సంపాదన. ఎక్కడికి వెళ్లినా తిరుగులేని అభిమానులు. దేవుని ప్రత్యక్షంగా చూసినంత అభిమానం. ఇవన్నీ వదిలిపెట్టి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా, అలాగే ఇందిరా లాంటి శక్తివంతమైన నాయకురాలు ఉండగా ఆమెను ఎదుర్కొనే శక్తి ఉంటుందా, అని ఆలోచించే ఆ రోజుల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి మర్రిచెట్టు వేళలా దేశమంతా బలమైన ఊడలు దించి, విస్తరించి ఉన్న కాంగ్రెస్ అనే కొండను ఢీకొట్టి ఆయన పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. అంతటి ఘనత శక్తి గలిగిన ఈ మహానటుడు, ప్రజా నాయకుడు మొత్తం ఆయన 400 చిత్రాల్లో నటించి ఔరా అనిపించారు.
 చాలా చిత్రాలు నిర్మించారు మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన 1923 మే 28వ తేదీన  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. మొదట తల్లి కృష్ణ అని పేరు పెడితే బాగుంటుందని భావించింది కానీ తర్వాత మేనమామ తారక రాముడు అని పేరు పెడితే  బాగుంటుందని ఆ పేరు పెట్టారు. ఆయన మొదట స్టేజి నాటకాలు నుండి వెండితెరపై మహానటుడిగా ప్రభంజనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా తిరుగులేని రాజకీయ నాయకుడిగా చరిత్ర తిరగరాశారు. అంతటి మహానటుడు 1996 జనవరి 18న పరమపదించారు. ఈరోజు ఆయన వర్ధంతి ఈ సందర్భంగా మరోసారి యాది లో..!

మరింత సమాచారం తెలుసుకోండి: