చైనా సృష్టించిన కరోనా వైరస్ మొన్నటి వరకు ప్రపంచ దేశాలలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది. ఒక దశ కరోనా వైరస్ ఎదుర్కొన్నాము అనుకునేలోపే రెండవ దశ కరోనా వైరస్ కూడా దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్నటి వరకు 2-దశల కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతుంటే చూసిన నవ్వుకున్న చైనాకు  ఇప్పుడు అదే కరోనా వైరస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది తెలుస్తోంది. గత కొంత కాలం నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో ఇక వరుసగా లాక్ డౌన్ లు విధిస్తూ వస్తుంది ప్రభుత్వం. అయితే మరికొన్ని రోజుల్లో చైనాలో బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలనుంచి ఎంతో మంది అథ్లెట్లు వారి సిబ్బంది కూడా బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అటు చైనాకు రాబోతున్నారూ. ఇలాంటి నేపథ్యంలో ఇక కరోనా వైరస్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని కేసులు వెలుగులోకి వచ్చినప్పటి కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది చైనా. కేవలం పదికి పైగా కేసులు వస్తేనే ఇక దాదాపు కోట్ల జనాభా ఉన్న 5 ప్రధాన నగరాల్లో కఠినమైన లాక్ డౌన్ విధించింది చైనా ప్రభుత్వం. చైనా ఎంత ప్రయత్నించినా కరోనా వైరస్ మాత్రం చివరికి ఒలంపిక్స్ నిర్వహించే బీజింగ్ లోకి వచ్చేసింది అని తెలుస్తోంది. ఇటీవలే బీజింగ్లో ఐదు కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో చైనా కు షాక్ తగిలింది. కాగా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బీజింగ్ వేదికగా వింటర్ ఒలంపిక్స్ జరుగుతూ ఉండగా.. ఇక ఈ ఒలంపిక్స్కు ప్రేక్షకులను అనుమతించడం లేదని ఇటీవల చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రీడాకారులు    వారితో పాటు వచ్చే సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వస్తున్న క్రీడాకారులు అందరిని కూడా బీజింగ్ చేరుకోగానే ఐసోలేషన్ లో పెట్టేందుకు చైనా ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: