ఏ తగువూ తేలడం లేదు.. ఎటూ ఏదీ తేల్చడం లేదు
వివాదాలకు విభిన్న వాగ్వాదాలకు
పలు అభిప్రాయ భేదాలకు
మాత్రం తావే లేదు
ఈ నేపథ్యాన మరో వివాదం ఆంధ్రావని వాకిట!
ఆంధ్రప్రదేశ్ లో రాజధాని విషయమై పొలిటికల్ వార్ నడుస్తోంది. చంద్రబాబు ప్రతిపాదించి,అభివృద్ధి చేసిన (పూర్తిగా కాదు ఎంతో కొంత ప్రాథమిక స్థాయిలో) రాజధాని అమరావతి వద్దని చెప్పారు జగన్. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు జగన్.పాలన సంబంధ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్నది ఆయన స్పంకల్పం. ఇదే విషయమై ఆయన చాలా అంటే చాలా పట్టుదలతో ఉన్నారు. అమరావతి భూములను మాత్రం వివిధ బ్యాంకులకు ప్రధాన ఆస్తి వనరుగా చూపించి అప్పులు తెచ్చుకుని పథకాల కోసం వెచ్చిస్తున్న జగన్ రాజధాని విషయమై మాత్రం ఎటూ తేల్చడం లేదు.
ఇప్పటికే 3 రాజధానుల బిల్లును అసెంబ్లీ లో విరమింపజేస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ (ఆర్థిక మంత్రి) ప్రకటించి సంచలనం రేపారు.దీంతో మళ్లీ రివైడ్జ్ వెర్షన్ (సవరించిన పద్ధతిని అనుసరించి) రాజధాని బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారు అన్నది తేలకుండానే మరో వివాదం రాజుకుంది.ఈ వివాదంలో అటు టీడీపీ ఇటు వైసీపీ జుట్టూ జుట్టూ పట్టుకునే విధంగానే వ్యవహారం మరియు సంబంధిత సమస్య నెలకొని ఉన్నాయి. ఆ వివరం ఈ కథనంలో...
మరో వివాదంలో జగన్ ఇరుక్కున్నారు.నాలుగో తరగతి పాఠ్య పుస్తకం (సెమిస్టర్ 2)లో ప్రచురించిన ఇండియా మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ రాజధానిని మాత్రం చూపించలేదు. తెలుగు మాధ్యమానికి సంబంధించి రూపొందింపజేసిన ఈ పుస్తకంలో మన రాష్ట్ర రాజధాని చూపించకపోవడంతో విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21 నేతృత్వాన ప్రచురితం అయిన పుస్తకం చివర్లో భారతదేశ చిత్ర పటం పొందుపరిచారు.ఇదే సందర్భంలో అన్ని రాష్ట్రాల రాజధానులనూ విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా మ్యాప్ పాయింట్ ఇచ్చారు. కానీ మన రాష్ట్రం వచ్చేసరిగా ఏపీ అన్న దగ్గర వదిలేశారు.అసలు రాజధాని పేరే ఇవ్వకుండా విద్యార్థులకూ,ఉపాధ్యాయులకూ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారు.దీనిపై టీడీపీ సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి