ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ చక్రం తిప్పిన నటి రోజా ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఒక వైపు రాజకీయ నాయకురాలిగా పని చేస్తూనే మరో వైపు బుల్లి తెరపై హోస్ట్ గా టివి ప్రేక్షకులకు టచ్ లో ఉన్నారు. అయితే దేనికదే సెపరేట్ అంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగిపోతున్న నటి, రాజకీయ నాయకురాలు రోజా ప్రస్తుతం వైసిపి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం లో చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈమె తన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ కి అంబాసిడర్ గా ఈమెను అందరూ అంటుంటారు. ఎందుకంటే అవతలి వారు ఎవరైనా సరే మనసులోని మాటను ముక్కుసూటిగా చెబుతూ అన్న మాటపై నిలబడి ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్లి ఎవరితోనైనా పోరాడగల సామర్థ్యం, ఆత్మవిశ్వాసం ఈమె సొంతం.

అయితే గత మూడేళ్లుగా చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారికి మరో ఉన్నతి లభించినట్లు సమాచారం. ప్రజల కోసం పాకులాడే తత్వం, ప్రత్యర్థులతో దీటుగా పోరాడే మనస్తత్వం ఉన్న ఈమె సేవలను మరింత పెంచేందుకు గాను రోజా గారికి మంత్రి పదవిని కట్టబెట్టాలని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ ఇపుడు ఆ దిశగా జగన్ సర్కారు నిర్ణయం ఉండబోతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న తరుణంలో వైసిపి నేత రోజాకి ఈ అవకాశం రాబోతోందని తెలుస్తోంది.

తెలుగు సంవత్సరాది ఉగాది నుండి మరికొన్ని కొత్త జిల్లాలు మనుగడలోకి రాబోతున్న విషయం విదితమే. ఇప్పుడు ఆంధ్రలో ఉన్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి కలవనున్నాయి. దాంతో ఏపిలో మొత్తంగా 26 జిల్లాలుగా మారనున్నాయి. తొందరలోనే రెండవ సారి మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారు. ఈ విస్తరణలో ఎవరు మంత్రి పదవులు పొందనున్నారో? ఎవరు మంత్రి పదవి నుండి తొలగిపోనున్నారో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: