ఇక అంతకంటే గొప్ప విషయం ఏంటంటే..ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీలు రాజకీయ ప్రత్యర్ధులుగా కాదు...అసలు ఏదో వ్యక్తిగతంగా శత్రువులు మాదిరిగా రాజకీయం చేస్తున్నాయి. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టడం, వాళ్ళు రివర్స్‌లో తిట్టడం చేస్తున్నారు. ఇక కొందరు మంత్రులు...ప్రత్యర్ధులని ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. బూతులు కాదు...కనీసం ప్రత్యర్ధులపై విమర్శలు చేయకుండా రాజకీయం చేయొచ్చని మేకపాటి నిరూపించారు.
మంత్రిగా తన పని తాను చేసుకుని వెళ్లడమే తప్ప..ప్రతిపక్ష టీడీపీ నేతలని గాని, చంద్రబాబుని గాని ఎప్పుడు ఒక మాట అనలేదు..ఇంకా వేరే ప్రత్యర్ధులని సైతం విమర్శించలేదు. అలాగే ఇప్పుడు నియోజకవర్గాల్లో కేవలం వైసీపీ మద్ధతుదారులకే పనులు చేసి పెట్టడం చేస్తున్న విషయం తెలిసిందే...కానీ గౌతమ్ అలా కాదు...తన ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అనే తేడా లేకుండా అందరికీ పనులు చేసి పెడతారు..అందరికీ అండగా ఉంటారు.
అసలు ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని చెప్పొచ్చు..మరి ఇలాంటి నాయకులని రీప్లేస్ చేయడం కష్టమనే చెప్పాలి...కానీ ఇప్పుడు ఆత్మకూరులో, క్యాబినెట్‌లో ఈయన ప్లేస్‌ని రీప్లేస్ చేయాల్సిన పరిస్తితి వచ్చింది. గౌతమ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం వైసీపీ శ్రేణులనే కాదు..టీడీపీ, ఇతర పార్టీ శ్రేణులని సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఈయన మరణం వైసీపీకి తీరని లోటు అని చెప్పొచ్చు. మరి క్యాబినెట్‌లో మేకపాటి గౌతమ్ ప్లేస్‌ని ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి