తెలంగాణా కాంగ్రెస్ సీరియల్ కష్టాలు పెరిగిపోతున్నాయి. అసలే మునుగోడు ఉపఎన్నిను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది సినియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మీటింగుల మీద మీటింగులు నిర్వహిస్తున్నా సమస్యలు పెరిగిపోతున్నాయే కానీ ఏమాత్రం తగ్గటంలేదు. ఇవన్నీ సరిపోదన్నట్లుగా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.  

ఎంఎల్ఏ రాజీనామా అధికారికంగా ఎక్కడా లేదు. అయితే ఏఐసీసీ అగ్రనేతల మీద కోపంతోనే ఏలేటి పార్టీకి రాజీనామాచేశారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మునుగోడు ఎంఎల్ఏగానే కాకుండా పార్టీకి కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రాజీనామాతో మొదలైన కంపు పార్టీని అన్నీవైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. రాజగోపాలరెడ్డితో రేవంత్ కు ఉన్న వైరం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా పాకింది.

ఎలాగూ ఎంఎల్ఏ, ఎంపీ ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారని  ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే మహేశ్వరరెడ్డిలోని అసంతృప్తిగా బయటపడింది. కార్యక్రమాల అమలుకు సంబందించి తనకు ఎలాంటి సమాచారం అందనపుడు ఇక తాను కమిటికి ఛైర్మన్ గా ఎందుకుండాలనేది ఎంఎల్ఏ లాజిక్. ఒకసారి ఎంఎల్ఏలో అసంతృప్తి బహిరంగంగానే  బయటపడిందంటే అది ఇక్కడితో ఆగదు. ఏదోరోజు బరస్టయి చివరకు పార్టీలోనుండి ఎగ్జిట్ అయ్యేంతవరకు వెళుతుంది.


మునుగోడు ఉపఎన్నిక వచ్చే నవంబర్, డిసెంబర్లో జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే ఇంకా మూడున్నర నెలలుండటంతో ఈలోగా  ఏలేటి లాంటి అసంతృప్తనేతలు ఇంకా ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. ఒకవైపు ఇప్పటికే పడిన బొక్కలను పూడ్చుకోవాలా ? లేకపోతే ఎప్పటికప్పుడు పడుతున్న బొక్కలను కూడా పూడ్చుకోవాలా అనేది రేవంత్ కు అర్ధం కావటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీకి పడుతున్న బొక్కలు సహజంగా పడుతున్నవి కావు కావాలనే పొడుస్తున్న పోట్లు. కాబట్టి ఈ బొక్కలను పూడ్చటం రేవంత్ వల్ల కాదన్న విషయం అందరికీ తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: