అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి జేఏసీ ముసుగులో కొద్దిరోజులు జరిగిన పాదయాత్ర ఆగిపోయినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అమరావతి టు అరసవల్లి అని జేఏసీ ముసుగులో కొంతమంది పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడిపోయింది.





పాదయాత్రలో పాల్గొనేవారి గుర్తింపుకార్డులను పోలీసులు తనిఖీచేయటం మొదలుపెట్టడం ఆలస్యం చాలామంది పారిపోయారు. కారణం ఏమిటంటే వాళ్ళెవరు అమరావతి ప్రాంతంలోని రైతులు కారు, స్ధానికులూ కారు. అంత రియల్ ఎస్టేట్ బాపతు+టీడీపీ నేతలు, కార్యకర్తలే కాబట్టి. అర్దాంతరంగా పాదయాత్రను ఆపేసిన జేఏసీ నేతలు కోర్టులో కేసువేశారు. తమ పాదయాత్రకు ఎలాంటి షరతులు విధించకూడదని, ఎవరినిపడితే వాళ్ళు పాల్గొనేందుకు అనుమతించాలని.





అయితే బుధవారం ఈ పిటీషన్ను విచారించిన కోర్టు జేఏసీ కేసును కొట్టేసింది. పాదయాత్ర విషయంలో సింగిల్ జడ్జి విధించిన షరతులను పాటించాల్సిందే అని గట్టిగా చెప్పింది. తాజా తీర్పుతో పాదయాత్ర ఇక మొదలయ్యే అవకాశాలు లేవని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆగిపోయిన పాదయాత్రను తిరిగి ఎలా మొదలుపెట్టాలో ఆలోచించకుండా జేఏసీ కోర్టులో కేసులు వేసి కాలక్షేపం చేస్తోంది. పైగా ఉభయగోదావరి జిల్లాల్లోకి పాదయాత్ర ఎంటరవ్వగానే గొడవలు కూడా మొదలయ్యాయి. అమరావతి పేరుతో రెచ్చగొట్టే చర్యలు చేస్తున్న కారణంగానే అమరావతి వ్యతిరేక ర్యాలీలు, ఆందోళనలతో కౌంటర్లు ఎదురవుతున్నాయి.





ఏ నియోజకవర్గంలోకి అడుగుపెట్టినా అక్కడంతా వ్యతిరేకత ఎదురవుతునే ఉంది. దీంతో పాదయాత్ర నిర్వాహకుల్లో కూడా సెకండ్ థాట్ మొదలైనట్లే ఉంది. వీళ్ళ పాదయాత్రకు ఎల్లోమీడియా నుండి తప్ప ఇంకెక్కడినుండి మద్దతు దొరకటంలేదు. సో జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూసిన తర్వాత అదీ ఇన్నిరోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టాలంటే అంతటి ఉత్సాహం ఉండద్దా ? ఏదేమైనా ఎల్లోమీడియా మద్దతు కారణంగా కృత్రిమ హైప్ తో ఇన్నిరోజులు పాదయాత్ర పేరుతో హడావుడిచేసిన జేఏసీ నాయకులకు మళ్ళీ దాన్ని నిలబెట్టాలంటే కష్టమే.  

మరింత సమాచారం తెలుసుకోండి: