మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసం కేసులో ఛైర్మన్ రామోజీరావు, ఆయన కోడలు, ఎండీ శైలజ గట్టిగా తగులుకున్నట్లేనా ? సాక్షి మీడియా ప్రకారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శిలో రామోజీ, శైలజ భారీఎత్తున మోసానికి పాల్పడ్డారని సీఐడీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేస్తోంది. ఈ నేపధ్యంలోనే మార్గదర్శికి చెందిన 23 చిట్టీలను సీఐడీ మూయించేసింది. దానిపై రామోజీ తెలంగాణా హైకోర్టులో కేసు వేశారు.





కేసును విచారించిన కోర్టు చిట్టీలోని ఖాతాదారుల అభ్యర్ధన ప్రకారం సీఐడీ మూయించేసిన చిట్టీలను తిరిగి తెరిపించింది. చిట్టీలను మూయించే అధికారం సీఐడీకి లేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఇపుడా విషయం తిరగబడినట్లు అర్ధమవుతోంది. విషయం ఏమిటంటే కోర్టులో చిట్టీదారులు కేసు వేయలేదట. చిట్టీదారుల పేరుతో రామోజీనే కేసు దాఖలు చేసినట్లు బయటపడింది. సీఐడీ నిర్ణయంపై కేసువేసిన చిట్టీదారులను అధికారులు మాట్లాడారట. అయితే తమకు అసలు కేసుగురించే తెలియదని చెప్పారట.





చిట్టీదారులు చెప్పింది విన్న సీఐడీ అధికారులకు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో మరింతలోతుగా చూస్తే చిట్టీదారుల పేర్లతో కోర్టులో వేసిన కేసు గురించి వాళ్ళకి తెలీనే తెలీదట. అంటే కొంతమంది చిట్టీదారులను పిలిపించి మార్గదర్శి మేనేజర్లు సంతకాలు తీసుకున్నారట. ప్రతినెలా ఏదో అవసరానికి ఖాతాదారులు మార్గదర్శి ఆఫీసులకు వెళ్ళి సంతకాలు చేస్తుంటారు కాబట్టి అలానే సంతకాలు చేశారట.





అయితే ఖాతాదారులతో సంతకాలు చేయించుకున్న యాజమాన్యం వాళ్ళపేర్లతోనే కోర్టులో పిటీషన్ దాఖలుచేసింది. అంటే సీఐడీ చర్యపై యాజమాన్యం కాకుండా ఖాతాదారులే కోర్టులో పిటీషన్ వేసినట్లు రామోజీయే సీన్ క్రియేట్ చేశారట. అందరితో పాటు కోర్టు కూడా ఖాతాదారులే పిటీషన్ వేసినట్లు భావించింది. అయితే సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడింది. దాంతో రామోజీ ఖాతాదారులను అడ్డుపెట్టుకుని కోర్టును ఏ విధంగా తప్పుదోవపట్టించారనే విషయమై మరో పిటీషన్ వేయబోతోందట. ఇదే జరిగితే రామోజీ మళ్ళీ కొత్తగా తగులుకున్నట్లే అనిపిస్తోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: