
చంద్రబాబు జాతక రీత్యా జరగొచ్చని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అదే సందర్భంలో పార్టీ జాతకాలను మాత్రం చెప్పలేదు. కానీ బాబు ఆరోగ్యం, జైలు జీవితం ఆయన గ్రహ స్థితిలోనే ఉంది. ముఖ్యంగా బాగాలేని రోజులు ఉన్నాయని తెలుసు కానీ ఇంత దాకా వెళుతుందని ఎవరూ అనుకోలేదు. కాబట్టి ఆయన విడుదలయ్యే రోజు త్వరలోనే ఉందని అంటున్నారు. కానీ విడుదల అయిన తర్వాత బాబుకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరమని అంటున్నారు.
మొత్తం మీద తెలుగు దేశం అభిమానులు పండగలు చేసుకునే టైం వచ్చింది. టీడీపీ నేతలు చంద్రబాబు విడుదల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు విడుదలైతే పార్టీకి కొత్త ఊపు వస్తుందని ఇక రాబోయే ఎన్నికల్లో తిరుగుండదని అంటున్నారు. మరి ఆయన విడుదల అవుతారా లేదా అనేది ఇంకా సందేహంగానే ఉంది.
చంద్రబాబు పీఏ విదేశాలకు పారిపోవడం బాబు విడుదలైతే సాక్షులను ప్రభావితం చేస్తారని ఏసీబీ వాదించడం ఇలా ఆయన విడుదలపై సందిగ్దం నెలకొంది. ఇలా ఒక్కొక్కరి వాదనలు ఒక్కొరకంగా ఉన్నాయి . రాజకీయాల్లో చంద్రబాబు అరెస్టు అనేది సంచలనంగా మారింది. 13 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం వల్ల టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 14 వ తారీఖు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.