ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన పరిపాలనే ప్రజాస్వామ్యం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజాస్వామ్య పాలన గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒకప్పుడు అయితే ఏకంగా అభ్యర్థులను చూసి లేదంటే వాళ్లు ఇచ్చే హామీలను చూసి ఓట్లు వేసేవారు జనాలు. ఇంకొంతమంది ఏకంగా ఎవరు ఎక్కువ డబ్బు పంచితే వారి వైపే నిలబడేవారు. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా గుడ్డిగా ఓటు వేయడం లేదు ఓటర్లు. తమకోసం ఎవరు పని చేస్తారో ముందు వెనక ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.


 అంతేకాదు ఏకంగా ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సరైన వాళ్ళు కాదు అని అనిపిస్తే ఏకంగా ఓటర్లే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇటీవల కాలంలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కొంతమంది ఇండిపెండెంట్ లు ఏకంగా ప్రధాన పార్టీల అభ్యర్థులను సైతం ఓడించి ఘనవిజయాలను అందుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఎక్కువగా యువత నేటితరం రాజకీయాలపై అసంతృప్తి చెంది ఏదో మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 82 ఏళ్ల వృద్ధురాలు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్గా బరిలోకి దిగింది. జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన 82 ఏళ్ళ వృద్ధురాలు చీటీ శ్యామల ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అయితే ఆమెకు ఏకంగా 788 ఓట్లు వచ్చాయి అని చెప్పాలి. కరీంనగర్ జిల్లా గంగధార మండలం కొరిక్యాలకు చెందిన చీటీ శ్యామల భర్త మురళీధర్ స్వాతంత్ర సమరయోధుడు. ఆమె కొడుకు శ్రీరామ్ విదేశాలకు వెళ్లి వచ్చి తమకు తెలియకుండానే తమ స్థలాన్ని అమ్ముకున్నాడని కొంతకాలంగా కష్టాలు పడుతుంది ఆమె  అయితే ఎవరూ పట్టించుకోలేదు. ఇలా ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన తన బాధ అందరికీ తెలుస్తుంది అని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: