తాజాగా తెలంగాణ ఎన్నికలు ఇటీవల ముగుసడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో కొత్త సీఎం ఎవరు అనే విషయంపై చాలా ఉత్కంఠత నెలకొంది.. కానీ అధికార పార్టీ అయినా కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించడం జరిగింది..TPCC గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సీఎం నేతగా ఎంపిక చేసినట్లు అధిష్టానం నిర్ణయించడం జరిగింది అంటూ కేసి వేణుగోపాల్ ఢిల్లీలో మీడియా ముందు తెలియజేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటినుంచో నెలకొన్న ఉత్కంఠకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించిందని చెప్పవచ్చు.



డిసెంబర్ 7వ తేదీన అంటే ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. సీఎం అభ్యర్థిగా వెలుగుబడే కొద్ది నిమిషాల ముందే రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో వెంటనే ఢిల్లీకి బయలుదేరారు.. ఆయన మార్గమధ్యంలో ఉన్న సమయంలో వేణుగోపాల్ ఈ ప్రకటన చేశారు. ఇక రేపు తెలంగాణకు వచ్చి తన ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి సీఎంగా చేరబోతున్నానంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనకు ఇలాంటి హోదా కల్పించిన ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో తెలిపారు.


అయితే సీఎం రేవంత్ రెడ్డి పైన చాలామంది ఎమ్మెల్యేలు పూర్తి మద్దతు తెలపగా అధిష్టానం కూడా ఎక్కువగా ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కొంతమంది సీనియర్ నేతలు వీటిని జీర్ణించుకోలేకపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగబోతోంది. పలువురు రాష్ట్ర సీఎంలను కూడా ఆహ్వానం అందించినట్లు సమాచారం. మరి ఎవరెవరు ఈ వేడుకకు సైతం హాజరు కాబోతున్నారు తెలియాలి అంటే మరో కొన్ని గంటల సేపు వేచి ఉండాల్సిందే.. ముఖ్యంగా కాంగ్రెస్ గెలవడానికి ముఖ్య కారణం తాము ప్రకటించిన పథకాలు అని కూడా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: