ముఖ్యమంత్రి పదవి విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చేశారా ? వైజాగ్ లో జరిగిన బహిరంగసభలో మాట్లాడిన మాటలు విన్న తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ పవన్ ఏమన్నారంటే ‘మెజారిటి స్ధానాలు గెలిస్తే ముఖ్యమంత్రి పదవి అడగచ్చు’ అని అన్నారు. పవన్ మాటలు పార్టీ నేతలు, క్యాడర్ తో పాటు కాపు నేతలను మోసం చేస్తున్నట్లే ఉంది. ఎందుకంటే జనసేన మెజారిటి సీట్లు గెలిచేదెపుడు ? ముఖ్యమంత్రి పదవి అడిగేదెప్పుడు ?

టీడీపీ, జనసేన పొత్తులో జనసేన మైనర్ పార్టీ అన్న విషయం అందరికీ తెలుసు. జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుందన్నది చంద్రబాబునాయుడు నిర్ణయంపైన ఆధారపడుంది. పొత్తులో ఏ పార్టీ ఎన్నిసీట్లకు పోటీచేయాలనే విషయాన్ని  ఫైనల్ చేసే అవకాశం చంద్రబాబు జైలులో ఉన్నపుడు పవన్ కు వచ్చింది. చంద్రబాబు జైలుకు వెళ్ళినపుడు ఓ నాలుగు రోజులు పవన్ ఓపికపట్టుంటే టీడీపీ నేతలు పవన్ దగ్గరకు వచ్చుండేవారు. అయితే పవన్ అలాచేయకుండా తనంతట తానుగా రాజమండ్రి జైలుకు వెళ్ళటం, పొత్తులు ప్రకటించటంతో చీపైపోయారు.

అందుకనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నిసీట్లిస్తే అన్ని సీట్లలో పవన్ పోటీచేయాల్సిందే తప్ప వేరే దారిలేదు. ఎన్నిసీట్లలో జనసేన పోటీచేస్తుంది ? ఎన్నిసీట్లలో గెలుస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కాబట్టి ఎట్టి పరిస్ధితుల్లోను పవన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు లేదుగాక లేదు. ముఖ్యమంత్రి అయిపోదామని చంద్రబాబు వ్యూహాలు పన్నుతుంటే పవన్ సీఎం ఎలాగవుతారు ? తమ పొత్తు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబే అన్న విషయం పవన్ కు నూరుశాతం క్లారిటి ఉంది.

ఆ విషయం బయటకు చెప్పకుండా ఇపుడు చెబుతున్నదంతా ఉత్త సొల్లు మాత్రమే. టీడీపీ+జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అని ఇపుడే ప్రకటిస్తే పార్టీ నేతలు, కాపు సామాజికవర్గం ఎలా రియాక్టవుతుందో పవన్ కు బాగా తెలుసు. అందుకనే వీళ్ళందరినీ మభ్య పెట్టాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే సొల్లుకబుర్లు చెబుతున్నది. లేకపోతే 175 సీట్లలో 30 సీట్లకు కూడా పోటీచేస్తుందో లేదో తెలీని జనసేన తరపున పవన్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎలాగవుతారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: