తెలంగాణా నూతన డిప్యుటి చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క తన భక్తిని చాటుకున్నారు. భక్తని చాటుకోవటం అంటే చాలామందికి ఇష్టదైవం ఎవరో ఒకళ్ళుంటారు కదా ? రెగ్యులర్ గా పూజలు చేస్తారు కదా ఇందులో ఆశ్చర్యమేముంది అనుకోవచ్చు. కానీ భట్టి మాత్రం దేవుళ్ళతో పాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫొటోకు కూడా పూజలు చేశారు. డిప్యుటి సీఎంగా బాధ్యతలు తీసుకునేముందు భట్టీ ఇంట్లో పూజలు చేసి బయలుదేరారు.





పూజగదిలో చాలామంది దేవుళ్ళ ఫొటోలు కనిపించాయి. పూజగదిని భట్టీయే ట్విట్టర్లో పోస్టుచేశారు. కాబట్టే ఈ విషయం జనాలందరికీ తెలిసింది. పూజగదిలో దేవుళ్ళ పొటోల ముందు నిలబడిన వీడియో క్లిప్పింగును భట్టీయే స్వయంగా పోస్టుచేశారు. పూజగదిలో చాలామంది దేవుళ్ళ ఫొటోలున్నాయి. వాటితో పాటు వైఎస్సార్ ఫొటో కూడా కనబడింది. మిగిలిన అందరి దేవుళ్ళకి పూజలు చేసి పూలదండలు వేసినట్లుగానే వైఎస్సార్ ఫొటో ముందు కూడా దూపం వెలుగుతు కనబడింది. ఆ ఫొటోకు పూలమాలా వేసుంది.





దేవుళ్ళకు పూజలు చేసిన తర్వాతే భట్టీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు ఎల్బీ స్టేడియంకు బయలుదేరారు. ఆమధ్య ఒకసారి భట్టీ వైఎస్సార్ గురించి మీడియాతో చెబుతు  తనకు దేవుడితో సమానమని చెప్పారు. బహుశా అందుకనే ఇతర దేవుళ్ళ ఫొటోలను పూజగదిలో ఉంచుకున్నట్లే వైఎస్సార్ ఫొటోను కూడా ఉంచుకున్నారు. ఏదేమైనా పూజగదిలో వైఎస్సార్ ఫొటో వీడియో ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.





నిజానికి గురువారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వాళ్ళల్లో అత్యధికులు వైఎస్సార్ మద్దతుదారులే అనటంలో సందేహంలేదు. భట్టీ మొదలుకొని ఉత్తమ్, శ్రీధర్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోధర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ వైఎస్సార్ ఫాలోవర్సుగా ముద్రపడిన వాళ్ళే. మంత్రులే కాదు ఇపుడు ఎంఎల్ఏలుగా పోటీచేసిన వాళ్ళలోనే కాకుండా గెలిచిన వాళ్ళలో  కూడా  చాలామంది వైఎస్సార్ స్ట్రాంగ్ సపోర్టర్లే ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఎంతమంది వైఎస్సార్ ఫొటోకు పూజలు చేస్తున్నారో లేదో తెలీదు. ట్విట్టర్లో పోస్టు చేస్తేనే భట్టీ పూజగది విషయం కూడా బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: