విజయవాడ వెస్ట్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డిని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కలవడం జరిగింది.కొంత కాలం నుంచి టీడీపీలో విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడాయన అయోధ్య రామిరెడ్డిని కలవడంతో వైసీపీలో చేరతారు అంటూ జోరుగా ప్రచారం అనేది జరుగుతోంది.ఇక జలీల్ ఖాన్.. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బలమైన మైనార్టీ నేతగా ఉన్నారు.అయితే జలీల్ ఖాన్ వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కుతుందా? జనసేనకు కేటాయిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో జలీల్ ఖాన్ అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కల్యాణ్ ను కలిశారు.


ఈసారి తనకే ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి విన్నవించారు జలీల్ ఖాన్. తనకు టికెట్ ఇవ్వకపోతే మైనార్టీలు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసుకునేంత సున్నిత మనస్కులు అని జలీల్ ఖాన్ అన్నారు. టికెట్ పొందేందుకు అన్ని విధాలుగా తాను అర్హుడిని అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర జలీల్ ఖాన్ విన్నవించారు.ఇక విజయవాడ వెస్ట్ టికెట్ తెలుగుదేశం పార్టీకి దక్కుతుందా? జనసేన పార్టీకి ఇస్తారా? అన్న దానిపై కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. టీడీపీ, జనసేనలో ఇద్దరు బలమైన నేతలు విజయవాడ వెస్ట్ టికెట్ కోసం ఎంతగానో పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కే ఛాన్స్ ఉందా? లేదా? అనే దానిపై సందిగ్ధత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జలీల్ ఖాన్ వైసీపీ కీలక నేతను కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముస్లింలలో బలమైన, కీలకమైన నేతగా ఉన్న తనకు వైసీపీ టికెట్ ఇస్తారనే ఆశతో జలీల్ ఖాన్.. అయోధ్య రామిరెడ్డిని కలిసినట్లు సమాచారం తెలుస్తుంది. 


జలీల్ ఖాన్ గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా బాగా వైరల్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ జలీల్ ఖాన్ ని ఏమి చదివారు అని ప్రశ్నించగా.. అందుకు జలీల్ ఖాన్ బికామ్ ఫిజిక్స్ చదివాను అని సమాధానం చెప్పి షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇప్పటికి కూడా మీమ్స్ రూపంలో ఆ ఇంటర్వ్యూలో జలీల్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: