ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అత్యంత పోరాటం చేసిన రాజకీయ పార్టీలలో బిఆర్ఎస్ పార్టీ ప్రధమ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో పెద్దగా వెనకాడాల్సిన పనిలేదు. ఇక వీరి పోరాటం దానికి జనాలు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో ఎన్నో గొడవల మధ్య... ఉద్యమాల మధ్య తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి నిరాహార దీక్ష చేసి ఎన్నో పోరాటాలను చేసిన కేసీఆర్ కి అతని పార్టీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కి ప్రజలు అంతా కలిసి పట్టం కట్టారు. దానితో ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో బారి మెజారిటీని తెచ్చుకొని 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాడు.

ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో కూడా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చాలా మంది అనుకున్నారు. అనూహ్యంగా ఈసారి కాంగ్రెస్ మెజారిటీని తెచ్చుకొని గవర్నమెంట్ ను ఫామ్ చేసింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడడంతో బిఆర్ఎస్ పార్టీలో అనుకున్న ప్రాధాన్యత దక్కని వారు ... అలాగే అనుకున్న ప్రదేశాలలో సీట్లు దక్కని వారు అంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

ఇక తాజాగా కేసీఆర్ స్నేహితుడు అయినటువంటి మదన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ స్నేహితుడు అయినటువంటి మదన్ రెడ్డి ఇవాళ మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో భేటీ అయ్యారు. మరికొన్ని రోజుల్లోనే ఈయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ ఎంపీ టికెట్ ను ఈయన ఆశించగా దానిని ఇప్పుడు వెంకటరామిరెడ్డి అనే అభ్యర్థికి ప్రకటించడంతో ఈయన అసంతృప్తి చెంది కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: