ఏపీలో ఎన్నికల వేడి రాజు కోవడంతో టిక్కెట్లు దక్కిన వారు ఇతర పార్టీలలోకి జంప్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇప్పుడు సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో పితాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే 2019 సాధారణ ఎన్నికలకు ముందు పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన వైసీపీ ఇన్చార్జిగా కొద్ది నెలలపాటు పనిచేశారు.

2019 ఎన్నికలలో ఆయన ముమ్మిడివరం వైసీపీ సీటు ఆశించారు. అయితే జగన్ చివరలో పితాని బాలకృష్ణ ను  పక్కనపెట్టి పొన్నాడ సతీష్ కుమార్ కు ఆ సీటు ఇచ్చారు. దీంతో పితాని బాలకృష్ణ పార్టీ మారి జనసేన నుంచి పోటీ చేసి ఏకంగా 30 వేలకు పైచిలుకు ఓట్లు సొంతం చేసుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది. ఈ సారి జనసేన తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. అయితే పొత్తులలో భాగంగా ఈ సీటును టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కే చంద్రబాబు ఇచ్చారు. దీంతో పితాని బాలకృష్ణ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

పైగా రెండేళ్ల క్రితమే తనకు పవన్ కళ్యాణ్ టికెట్ కరారు చేసి ఎన్నికల సమయంలో ఇప్పుడు తనను పట్టించుకోకపోవడంతో పితాని ఆగ్రహంతో ఉన్నారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కావటం వల్ల తనను పవను పట్టించుకోవడంలేదని ఆయన మండిపడుతున్నారు. జనసేన లో శెట్టిబలిజల కు స్థానం లేదని ... అందుకే పార్టీ వీడా లని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ ను కలిసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో .. జనసేన పార్టీని వీడి వైసీపీలో చేరేందుకు పితాని రెడీ అయినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజులలోనే పితాని బాలకృష్ణ పార్టీ మార్పు పై క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: