- భార్య జ‌య‌ప్ర‌ద క‌మ్మ అవ్వ‌డంతోనే భువ‌నంకు సీఎం ప‌ద‌విచ్చిన ఇందిర‌
- ఈ ఈక్వేష‌న్‌తో ఓట్లు గుద్దేస్తార‌మ్మ అని చెప్పిన పివి
- అప్ప‌ట్లోనే క‌మ్మ + రెడ్డి ఈక్వేష‌న్ సంచ‌ల‌నం


( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఇప్పుడు రాజకీయాలలో ఇంటర్ క్యాస్ట్ బంధాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భార్యా, భర్త వేరువేరు కులాలకు చెందినవారు అయి ఉండి.. కాస్త ఆర్థికంగా స్థితి మంతులు అయితే వారికి టిక్కెట్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. మామూలుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కులాల గోలలు ఎప్పుడూ ఉంటాయి. ఎవడు మన కులం వాడు అని చూసి మరి ఓట్లు వేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలన్నా, ఎంపీ సీట్లు ఇవ్వాలన్న రాజకీయ నాయకులు ఈతరహలోనే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఈ తరహా ప్లానింగ్ ఎక్కువగా నడుస్తోంది.


అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల ఒక నేతకు ఏకంగా ముఖ్యమంత్రి పదవి దక్కింది అంటే ఎవరైనా నమ్మగలరా.. ? ఇది నిజం. ఆ నేత ఎవరో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదవ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన భువ‌నం వెంకట్రామిరెడ్డికి ఇలాగే పదవి దక్కింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల పాటు కంటిన్యూగా ఏలింది. ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చేంతవరకు కాంగ్రెస్‌కు తిరిగే లేదు. ఈ క్రమంలోనే ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆంధ్రప్రదేశ్‌ను ఏలేశారు.


అప్పట్లో ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు.. రెడ్డి సామాజిక‌వర్గ ఆధిపత్యాన్ని సహించలేక భువ‌నం వెంకట్రామిరెడ్డి పేరు తెరమీదకు తెచ్చారన్న పేరు ఉంది. ఆయన ఇందిరా గాంధీకి స్వయంగా చెప్పి భువ‌నంకు ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కేలా చేశారు. భువ‌నం వెంకట్రామిరెడ్డి భార్య జయప్రదాదేవి కమ్మ.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే రెడ్లు, కమ్మలు అందరూ మనకే ఓట్లు వేస్తారని చెప్పడంతో.. ఆయన సలహా మేరకే ఇందిరా గాంధీ భువనం వెంకటరామిరెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.


వెంకటరామిరెడ్డి కొద్ది నెలలపాటు ఈ పదవిలో ఉన్నాక.. మళ్ళీ కాంగ్రెస్‌లో కుట్రలు, వెన్నుపోట్లు మొదలవడంతో ఆయన్ని కూడా పదవి నుంచి దించేశారు. ఇక భువనం జయప్రద దేవి కూడా గుంటూరు జిల్లా వినుకొండ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఎన్టీఆర్ గుంటూరు లో జ‌రిగిన భువ‌నం ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి వెళ్లే రాజ‌కీయాల్లోకి రావాల‌hat happened behind Indira Gandన్న ఆలోచ‌న చేశార‌ని కూడా అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: