గత కొంతకాలం నుంచి ఏపీ రాజకీయాల్లో నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైసిపి ని వదిలిన రఘురామా ఇక బిజెపిలో చేరతారని ప్రచారం జరిగిన.. అలా జరగలేదు. బిజెపి నుంచి సీటు వస్తుందని జోరుగా ప్రచారం జరిగిన.. ఇక బిజెపి ఆయనను పట్టించుకోలేదు. దీంతో ఇక రఘురామ రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయనను టిడిపి పార్టీలో చేర్చుకొని ఇక ఆ పార్టీ కంచుకోట అయిన ఉండీలో ఎమ్మెల్యే టికెట్ను కేటాయించారు చంద్రబాబు.



 ఈ టికెట్ కేటాయింపుతో ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయ్ అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ బీజేపీ మధ్య సీట్ల మార్పు ఉంటుందనే చర్చ కూడా గత కొన్ని రోజుల క్రితమే మొదలైంది. పశ్చిమగోదావరి ఉండి ఎమ్మెల్యే అలాగే నరసాపురం ఎంపీ అభ్యర్థి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుపై ఇక ప్రస్తుతం కూటమిలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. టిడిపిలో రఘురామ చేరికతోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నది తెలుస్తోంది. కొత్తగా వచ్చిన రఘురామకు ఉండి టికెట్ ఇవ్వడంతో టిడిపి మాజీ ఎమ్మెల్యే శివరామ నుంచి అసంతృప్తి మొదలైంది.  చంద్రబాబు చెప్పిన వినకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు శివరామరాజు.



 ఇక ఇటీవల అనపర్తి సీటు బిజెపికి కేటాయించడంతో.  ఇప్పటికే ప్రకటించిన టిడిపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం న్యాయం చేయాలి అంటే రోడ్డెక్కారు  దీంతో మళ్లీ ఈ సీటు విషయంలో మార్పు ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది   బిజెపికి కాకుండా టిడిపికి ఇస్తారని ప్రచారం మొదలైంది. అలాగే నరసాపురం సీటును టిడిపికి ఇస్తే ఏలూరు లోక్సభ స్థానాన్ని బిజెపికి ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదన కూడా తెరమీదకి తీసుకొచ్చారట  ఇక ఉండి స్థానంలో నరసాపురం బిజెపి అభ్యర్థి శ్రీనివాస్ శర్మను పోటీ చేయిస్తామని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారట. ఇలా సీట్ల కేటాయింపులలో మార్పులు చేర్పులపై బిజెపి జాతీయ నాయకత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలా రఘురామ రాకతో కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: