ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకి నేతలను సైతం భయ పెట్టేలా కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఎవరు గెలుస్తారని విషయం పైన కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. తాజాగా వైయస్సార్ జిల్లా కమలాపురంలోని మాజీ ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి టిడిపి పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. టిడిపి పార్టీలో చేరిన కొద్ది రోజులకే అంతకంటే వేగంగా రిటర్న్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.. నిజానికి వీరశివ కమలాపురం టికెట్లు ఆశించగా ఆయన తమ్ముడు ప్రవీణ్ రెడ్డి పొద్దుటూరు సీటును ఆశించారు. వీళ్ళిద్దరికీ కూడా చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు.


మూడేళ్లుగా పొద్దుటూరులో ప్రవీణ్ రెడ్డి పార్టీకి ఎంతో కృషి చేశారని కానీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పైనే చంద్రబాబు ఎక్కువగా ముగ్గు చూపారు ..ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తీరు పైన ఫైర్ అయ్యారు.. కేవలం ధనికులకే చంద్రబాబు టికెట్లు ఇస్తున్నారని విమర్శలను కూడా చేయడం జరిగింది.. కడపలో మాధవి రెడ్డి లాంటి వారికి డబ్బు ఉందనే కారణంతోనే వారికి టికెట్ ఇచ్చారంటూ చంద్రబాబుపై విమర్శించారు వీరశివారెడ్డి..అలాగే లక్ష్మీ రెడ్డి వంటి వారికి డబ్బు లేదని టిడిపిలో కష్టపడి పని చేసిన కూడా ఆయనకు సీటు ఇవ్వలేదని కూడా విమర్శించారు. తాను కమలాపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అయిన తనకు టిడిపిలో గుర్తింపు లేదు.. కానీ నాలుగు సార్లు ఓడిపోయిన పుత్త కుటుంబానికి టికెట్ ఇవ్వడం ఏంటా అంటూ విమర్శించారు. ప్రజాదరణ కలిగిన వారికి కాకుండా డబ్బు అధికంగా ఉండే వారికి ఎలా టికెట్ ఇస్తారంటూ వీర శివారెడ్డి  బాబుని నిలదీశారు. గత ఎన్నికలలో కూడా కడపలో 10 అసెంబ్లీ స్థానాలలో వైసిపి గెలిచినట్టుగానే ఈసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ అన్ని సీట్లను గెలుస్తుంది అంటూ మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి జోస్యం చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే విషయాన్ని ప్రకటిస్తానంటూ వీర శివారెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: