మొన్న 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత.. ఎన్నికల అయిన సాయంత్రమే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు కూడా హైదరాబాద్ కి పైనమయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తాడేపల్లి లోని ఉండి.తమ ఇంటికి వెళ్ళిపోయారు. పులివెందుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో అందరిని మాట్లాడిస్తూ ఇంటికి చేరుకున్నారు జగన్. ఇప్పుడు జగన్ తన కుమార్తెలు కుటుంబంతో కలిసి లండన్ తో పాటు పలు రకాల దేశాలను చుట్టేయడానికి వెళ్లారు.దీంతో భయపడి జగన్ విదేశాలకు వెళ్ళిపోయారని.. బై బై జగన్ అనే ట్యాగులను టిడిపి వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ కూటమి వాళ్లు కూడా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. జగన్ ఇక వెనక్కి రాడు.. ఆట్టు నుంచి అటే పారిపోతాడు.. విజయ్ మౌల్యతో కూర్చుంటాడు.. ఇటు వస్తే విమానం దిగగానే.. తనను జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూటమివాళ్ళు వైరల్ గా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా చేసే వాళ్ళని యూనో బ్యాచ్ అని పిలుస్తారు. అనవసరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు..


అసలు జగన్ వెళ్ళిపోయే వాడైతే.. గతంలో 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే విదేశాలకు పారిపోయేవారు. అతనెవరు ఉరితీయలేరు.. ఈ దేశంలో ఫైనాన్షియల్ క్రైమ్ కేసుల్లో వచ్చేటువంటి విచిత్రం ఏమిటంటే.. చంద్రబాబు గారి బైలే ఉదాహరణ అని చెప్పవచ్చు. 50 రోజులకే బేలు తెచ్చుకున్నారు. జగన్ కి కూడా అప్పట్లో అలాగే వచ్చింది. జగన్ని జైల్లో పెట్టడం కూడా ఇప్పుడు సాధ్యం కాదు.. ఆ కేసులన్నీ కోర్టులో తీర్పు వచ్చి జైలు శిక్ష పడితే తప్ప మరేమీ చేయలేరు. భయంతోనే కేవలం టిడిపి కూటమి నేతలు బై బై జగన్ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఓడడం గెలవడం అనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది. ఇలానే కూటమి చేస్తూ ఉంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ సోషల్ మీడియాలో మరింత దారుణంగా ట్రోల్ కు గురయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా అంత బలం ఏ పార్టీకి కూడా లేదని చెప్పవచ్చు. పోయి పోయి మళ్లీ అలాంటి పార్టీతోనే పెట్టుకుంటే రాబోయే రోజుల్లో టిడిపి పార్టీకి మరింత కష్టమవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: