ఏపీలో ఎలక్షన్స్ ముగిసిపోయాయి. నేతలంతా ఎన్నికల రిజల్ట్ కోసం  కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారి భవితవ్యం మొత్తం జూన్ 4న బట్టబయలు కానుంది. అలాంటి ఈ తరుణంలో  175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు జనాలు ఎటు ఓటేశారు అనేది వారికి ఇంతవరకు అంతుపట్టడం లేదట. విదేశాల్లోకి వెళ్లి కాస్త  చిల్ అవుదాం అనుకున్నా వారిని గెలుపా ఓటమా అనే వేదన వేధిస్తోందట. ఇదే తరుణంలో చాలా పార్టీలు వారి యొక్క సొంత అంతర్గత సర్వేలను నిర్వహించుకుంటున్నాయి. అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మేమే అధికారంలోకి వస్తామని బాహాటంగా చెప్పారు.

 కానీ టిడిపి నాయకులు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే టిడిపి అధినాయకత్వం అంతర్గత సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో వారు పక్కాగా కొన్ని లెక్కలు వేసుకున్నారట. మరి వారికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి. అనే వివరాలు చూద్దాం..  తెలుగుదేశం పార్టీ రెండు అంతర్గత సర్వేలు చేయించినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఏప్రిల్ 20వ తారీకు వరకు పూర్తయిన సర్వే విషయానికి వస్తే.. కూటమికి 175 స్థానాల్లో 115 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వారికి సర్వేలో తేలిందట.. ఆ తర్వాత మే 1 నుంచి మే 10 వరకు చాలా స్పీడ్ సర్వే నిర్వహించారట. ఈ సర్వే కేవలం 80 నియోజకవర్గాల్లో మాత్రమే చేయించుకున్నారు.

ఇందులో కనీసం 70 సీట్లలో విజయం సాధిస్తామని వారికి అంచనా వచ్చిందట. సర్వే నిర్వహించిన తర్వాత వీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్   సరికొత్త అంశాలను ప్రజల్లోకి  తీసుకెళ్లారు. దీని వల్ల కూడా ఒక రెండు శాతం ఓటింగ్  పెరిగిందని  వారు అంచనాకి వచ్చారు.  ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత వీరంతా చర్చించిన దాన్ని బట్టి చూస్తే  ఎన్నికలకు ముందు 115 సీట్లు వస్తాయని భావించిన వీరికి రెండు శాతం పెరిగిన ఓట్లతో  130 నుంచి 135 సీట్లు వస్తాయని భావిస్తున్నారట.  అందుకే చంద్రబాబు నాయుడు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. ఇదే నిజమైతే వైసిపి చాప చుట్టేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: