ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి. రిజల్ట్ కు  ఇంకా ఐదు రోజులే టైం ఉంది.  ఈ సందర్భంలోనే ఎవరి లెక్కలు వారు వేసుకొని గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే ఇంటర్నల్ సర్వేలు  చేయించుకుంటున్నారు. ఇదే తరుణంలో టిడిపి ఇంటర్నల్ సర్వేలో 115 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది.  ఇదే క్రమంలో వైసిపి కొంతమంది సీనియర్ నాయకులు  ఇంటర్నల్ సర్వేలు చేయించారట. ఆ సర్వేల్లో వారికి  అనేక లెక్కలు బయటకు వచ్చాయి. ఇదే పక్కా అని చెప్పేసి వైసిపి నాయకులు కూడా అంటున్నారట. మరి వైసిపి నాయకుల ఇంటర్నల్ సర్వేలో తేలింది ఏమిటి వివరాలు చూద్దాం.. 

వైసిపి నాయకులకే వన్ సైడ్ ఓట్లు పడ్డాయని వైసిపి నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా చెప్పుకోవడం లేదట.  నిరుద్యోగ యువత ఉద్యోగులు వలస వెళ్లిన వ్యక్తులు చాలామంది టీడీపీకి ఓట్లు వేశారట. కానీ మిగతా వర్గాల వారు  ఎక్కువగా వైసిపి వైపు చూసినట్టు వారు లెక్కలు వేసుకున్నారట. ముఖ్యంగా వైసిపి అభ్యర్థులు అందరూ చెప్పే మాట మాత్రం ఇది ఒక్కటే. 105 సీట్లు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెబుతున్నారు. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ లెక్క ఏంటి అంటే.. 70 సీట్లు పక్కా వైసీపీ గెలుస్తుందని క్లియర్ గా చెబుతున్నారు. ఈ 70 నియోజక వర్గాల్లో ఐదువేల మెజారిటీ 100% వస్తుందని వారు చెబుతున్నారు.

 ఇందులో 50 సీట్లు పక్కాగా మేము ఓడిపోతున్నామని చెబుతున్నారు. మిగతా 55 స్థానాల్లో టఫ్ కాంపిటీషన్ ఉంటుందట. ఎవరికి వచ్చిన 100 నుంచి 1000 లోనే మెజారిటీ ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా వైసిపి ఇంటర్నల్ సర్వే నిర్వహించుకొని గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి వారి సర్వే నిజమవుతుందా లేదంటే బోల్తా కొడుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: