మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై దారుణమైన కామెంట్లు చేశారు. ముందుకు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ లోకేష్ ల గురించి చాలా చులకనగా మాట్లాడేవారు. వాళ్లు గెలవలేని అసమర్థులు మోసగాళ్లు అంటూ మాట్లాడేవారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఆమె రెచ్చిపోయారు కానీ ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయింది. నగిరిలో రోజా దారుణమైన ఓటమిని చవిచూశారు. దీని తర్వాత ఆమెను సోషల్ మీడియాలో హద్దులు మీరి మరీ టీడీపీ వాళ్లు ట్రోల్ చేస్తున్నారు.

వైసీపీ నేతల్లో ఎక్కువగా టార్గెట్ అయిన వారిలో ఆమె ముందు ఉన్నారు. అయినప్పటికీ, ఆమె అధైర్యపడలేదు. తరచూ మీడియా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఆమెను ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

అయితే "జగన్ అభివృద్ధి, సంక్షేమ ఎజెండాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో చంద్రబాబును ఎందుకు ఎన్నుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేద"ని రోజా వ్యంగ్యంగా నవ్వుతూ అన్నారు.  కొత్త ప్రభుత్వానికి సంబంధించి, జగన్ అభివృద్ధి ఎజెండాను కూటమి కొనసాగించాలని రోజా అన్నారు.

ఖరీదైన రుషికొండ ప్యాలెస్ గురించి అడిగిన ప్రశ్నకు రోజా నవ్వుతూ.. ‘‘చంద్రబాబుకు జగన్‌పై అన్ని విధాలా అసూయ ఉంది. సీఎంగా ఉన్న 14 ఏళ్లలో చంద్రబాబు రుషికొండలో టూరిజం బ్లాక్‌ను ఏనాడూ నిర్మించలేకపోయారు.. అందుకే చంద్రబాబు, ఆయన కూటమి నేతలు రుషికొండ భవనం విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు." అని చెప్పుకొచ్చారు. నేను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రుషికొండలో టూరిజం భవనాన్ని జగన్ నిర్మించడం గర్వంగా భావిస్తున్నా’ అని రోజా వ్యాఖ్యానించారు.

 రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. టీడీపీ అధిష్టానంతో పాటు అందరూ కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు అయినా సరే ఆమె నవ్వుతూ టీడీపీ వాళ్లపై ధైర్యంగా విమర్శలు చేస్తున్నారు. మిగతా వైసీపీని నేతలందరూ చాలా సైలెంట్ అయిపోయారు కానీ రోజా కొడాలి నాని పేర్ని నాని వంటి వారు మాత్రం ధైర్యంగా తమ గొంతుకను వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: