ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడమే కాకుండా... జగన్మోహన్ రెడ్డి పార్టీకి చుక్కలు చూపిస్తోంది. గత ప్రభుత్వ తప్పిదాలను తెరపైకి తీసుకువచ్చి... ఏపీ ప్రజల ముందు పెడుతోంది తెలుగుదేశం కూటమి సర్కారు. ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేలా... కీలక నిర్ణయం తీసుకుంది.


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లాల ప్రక్షాళనను చేపట్టింది ఏపీ సర్కార్. ఇందులో భాగంగానే... భారీ ఎత్తున జిల్లా కలెక్టర్ల బదిలీలకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్‌. 26 జిల్లాలకు గానూ 13 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. జీఏడీకి ఆరు జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లను జీఏడీకి పంపింది చంద్రబాబు సర్కార్. విశాఖ భూ కుంభకోణం ఆరోపణల్లో విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున్ ఉన్న సంగతి తెలిసిందే.ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూ దోపిడీకి మల్లిఖార్జున్ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.... విశాఖలో అసైన్డ్ ల్యాండ్ స్కాంలో మల్లిఖార్జున్ పాత్ర ఉందని ఆరోపణలు కూడా ఉన్నట్లు గుర్తించింది చంద్రబాబు సర్కార్. దీంతో విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున్ ను బదిలీ చేశారు. అటు ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్నప్పుడు మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలు ఉన్నట్లు గుర్తించారు. మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారని మాధవీ లతపై అభియోగాలు ఉన్నాయి.అమరావతి రైతుల పాదయాత్రను తూ.గో జిల్లాలో అడ్డుకున్నారట మాధవీలత. దీంతో మాధవీలతపై వేటు వేశారు. అటు మాజీ సీఎం జగన్ ప్రైవేట్ సంస్థలకు సహకరించేలా ఉత్తర్వులిచ్చారని షన్మోహనుపై విమర్శలు వచ్చాయి. దీంతో షన్మోహనుపై కూడా వేటు వేశారు చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కలెక్టర్లను జీఏడీకి పంపారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: