ఏపీ తాజా ఎన్నికల్లో జగన్ ప్రభుతం వైస్సార్సీపీ యెంత దారుణంగా ఓటమి పాలైందో వేరే చెప్పాల్సిన లేదు. దానికి కారణాలు ఇక్కడ చర్చించడం కూడా అనవసరం. ఎందుకంటే నేటి సోషల్ మీడియా సమాజంలో ప్రతి ఒక్కరికీ ఇటువంటి విషయాలపట్ల ఎంతోకొంత అనుభవం కలదు. అందువల్లనే దేశంలో సరికొత్త రాజకీయాలకు తోవ దొరుకుతోంది. ఇక అసలు విషయంలోకి వెళితే వైసీపీ నాయకులకి మొదటినుండి సభా మర్యాదలు తెలియవు అనే నానుడి ఉంది. ఇంత జరిగినా వారు మారకపోవడం దురదృష్టకరం.

అవును... సాధారణంగా ఏదైనా కొత్త పనికి పూనుకున్నపుడు ద్వితీయ విఘ్నం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అది చిన్న పని అయినా.. పెద్ద పని అయినా మొదటి రోజు మాదిరే రెండో రోజు కూడా కంటిన్యూ చేయటం ఒక సాంప్రదాయం. విషయం దేవుడికెరుకగానీ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొదటి రోజున ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్ తన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏదో మమ అనిపించుకుని అనంతరం సభ నుంచి నేరుగా పార్టీ నేతలతో కలిసి తాడేపల్లికి చెక్కేశాడు.

ఆ తరువాత రోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు హాజరు కాని జగన్.. పులివెందుల పర్యటనకు అంటూ వెళ్ళిపోయాడు. సభా సంప్రదాయం ప్రకారం అయితే ప్రతిపక్ష నేత (ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్ష నేత లేరు) స్థానంలో ఉన్న జగన్ అనధికారికంగా అయినా హాజరు కావాల్సింది. కానీ మనోడు పత్తా లేకుండా పోయాడు.  ఈ తరుణంలోనే స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోవాల్సిందన్న మాట బలంగా వినిపించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ద్వితీయ విఘ్నాన్ని కూడా జగన్ లెక్క చేయకపోవటమా? అన్నది ఇప్పుడు సొంత పార్టీలో సైతం ప్రశ్నగా మారింది. అవును, జగన్ కు ఇలాంటి వాటిపై నమ్మకం ఉన్నా లేకున్నా క్యాడర్ కోసం కొన్నింటిని ఫాలో కావటం మంచిదన్న మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: