ఎక్కువగా మహారాష్ట్రలో కొన్ని వైరస్లు కొత్తగా పుట్టుకొస్తూ ఉన్నాయి. దీంతో ఇతర ప్రాంతాలలోని ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యాల చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఒక వింత వ్యాధి బయటపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బుల్దానా జిల్లాలో ఉండే గ్రామాలలో కూడా ప్రజలకు గోళ్లు అకస్మాత్తుగా ఊడిపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని నెలల నుంచి చాలామందికి బట్టతల అనే వైరస్ కూడా తీవ్రంగా కలకలని సృష్టిస్తోందట. ఎక్కువగా జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నారట అక్కడి ప్రజలు.


డిసెంబర్ 2024 నుంచి ఈ వైరస్ వెలుగులోకి వచ్చిందని.. బోండగావ్  అనే ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలలో సుమారుగా 300 మంది గ్రామస్తులకు జుట్టు రాలిపోవడం మరింత కలవరపాటుకు గురిచేస్తుందట. అలాగే ఉన్నట్టుండి గోళ్లు కూడా ఊడిపోతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు.  అక్కడ ఆ ఊరి సర్పంచ్ రామేశ్వర్ దర్గాల మాట్లాడుతూ గత ఏడాది ఇందుకు సంబంధించి అన్ని విషయాలను కూడా వైద్యులకు చెప్పామని ఇప్పుడు గోళ్లు కూడా ఊడిపోతూ ఉండడంతో వైద్య పరీక్షలు కూడా వైద్యులు ప్రారంభించారని.. అలాగే రక్త నమూనాలను కూడా సేకరించారని తెలియజేశారు.


ఇక బుల్దానాలో ఉండే ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ కూడా వీటిని ధ్రువీకరించారు.నాలుగు గ్రామాలకు 29 మంది వ్యక్తులలో గొల్ల వైకల్యం కనిపించిందని ఇవి పూర్తిగా ఉడిపోయాయని వారికి ప్రాథమిక చికిత్స కూడా అందించామని తెలిపారు. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ అమూల్  మాట్లాడుతూ జుట్టు, గోర్లు రాలడం వంటివి ఎక్కువగా సెలీనియం తిన్న వాటివల్లే ఉంటుందని  నిర్ధారణలు తెలియజేస్తున్నాని తెలిపారు. అందుకే మరిన్ని పరీక్షలు చేసి ఖచ్చితమైన విషయాన్ని తెలియజేస్తామని తెలిపారు.. అయితే ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసినటువంటి గోధుమలలో ఎక్కువగా సెలీనియం ఉండడం వల్ల ఇది సంభవించింది అంటూ తెలుపుతున్నారట. మరి పూర్తి సమాచారం ఏంటన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: