ఆంధ్రప్రదేశ్ ఏపీసిసి వై ఎస్ షర్మిల  గురించి రాజకీయాలలో చెప్పాల్సిన పనిలేదు.. 2024 ఎన్నికలలో వైయస్ జగన్ ఓడిపోవడానికి ఈమె కూడా కారణమని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వం పైన పలు రకాల ప్రశ్నలను వేస్తూ ఉంటుంది షర్మిల. అయితే తాజాగా షర్మిల హౌస్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మరి వైయస్ షర్మిల హౌస్ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


ఉద్దండరాముని పాలెంలో ఈ రోజున షర్మిల పర్యటించే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే షర్మిల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.. 2015లో పీఎం నరేంద్ర మోడీ ఉద్దండరాముని పాలెం  కు శంకుస్థాపన చేయడానికి వస్తూన్నారని విషయం తెలుసుకున్న షర్మిల తాను కూడా ఆ ప్రాంతంలో పర్యటించాలనే విధంగా నిర్ణయం తీసుకున్నదట. అయితే అందుకు పోలీసులు సైతం అక్కడికి వెళ్ళకూడదని ఆంక్షలు  కూడా విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా షర్మిల పర్యటనకు రాకూడదంటూ పోలీసులు ఆమె ఇంటి చుట్టూ మొహరించారు.

ఉద్దండరాముని పాలెం ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు షర్మిల ని అడ్డుకున్నారు. షర్మిల ఇంటి వద్ద భారీగానే భారీ కేట్లు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అయితే పోలీసుల పనితీరుపైన షర్మిల తీవ్రమైన ఆగ్రహాన్ని కూడా తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.ఎలాగైనా సరే మోడీ పర్యటన చేస్తున్న ప్రాంతానికి వెళ్లి తీరుతానంటూ షర్మిల చాలా క్లారిటీగా తెలియజేసింది. ఈ క్రమంలోనే షర్మిల నివాసం వద్ద ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణ నెలకొన్నట్లు సమాచారం. మరి మోడీ పర్యటన అనంతరం షర్మిల ఏవిధంగా మాట్లాడుతుందో చూడాలి మరి. అమరావతి శంకుస్థాపన చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో పీఎం మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకే మోడీ కూడా ఏపీకి రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: