ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చాలామంది పార్టీలు మారిన సందర్భాలు నేతలు ఉన్నారు. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా మారుతూ ఉన్నారు. విశాఖలో మాజీ మంత్రి టిడిపి నేత గంటా శ్రీనివాస్ చాలా పవర్ఫుల్ లీడర్ అన్న సంగతి తెలిసిందే.. ఏ రోజు కూడా ఆయన ఎన్నికలలో ఓడిపోలేదు. ఒకసారి ఎంపీ 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికలలో భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గంటా. అయితే అంచనాలు తప్పకుండా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ గంటాకు చాన్స్ మాత్రం దక్కలేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉండిపోయారు.


ఇదంతా ఇలా ఉంటే టిడిపి హై కమాండ్ కు కూడా ఈయన మాట పెద్దగా చెల్లడం లేదని విషయం కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు టిడిపి పార్టీలో అవకాశం కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖ మేయర్ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా గెలిచినందుకు అవిశ్వాసం నెగ్గెందుకు కూడా కేవలం ఒకే ఒక్క ఓటు కీలకంగా పనిచేసింది. ఆ ఓటే అవంతి కుమార్తె లక్ష్మి ప్రియాంకది. అలా టిడిపి పార్టీకి సరైన సమయంలో ఆదుకున్నటువంటి అవంతి మీద కూడా పార్టీ పెద్దలు చాలా దయ చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ఒకప్పుడు టిడిపి పార్టీలోకి వస్తానని చెప్పినప్పటికీ కూడా స్పందించని నేతలు ఇప్పుడు కావాలని పిలుస్తున్నారట. దీంతో అవంతి వర్గం మరొక లాగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ అన్ని కలిసి వచ్చి అవంతి శ్రీనివాస్ టిడిపి పార్టీలోకి చేరుతారా ఒకవేళ చేరితే గంటాకు చెక్  పడేలా ఉంటుందని పలువురు నేతలతో పాటు, గంటా కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారు. గంటా వల్లే అవంతి పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చిన ఇప్పుడు ఆయన సీటుకే ఎసరు పెడతారా లేకపోతే కలిసే ఉంటారా అన్నది చూడాలి మరి. మరి ఈ విషయం పైన అవంతి శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే మధ్యలో అటు గంటా శ్రీనివాస్ , అవంతి శ్రీనివాస్ ఇద్దరు మధ్య విభేదాలు వచ్చాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: