
తమిళనాడు రాష్ట్రంలో బ్రతికే మనం మన బిడ్డలకు ఇంగ్లీష్ లేదా ఉత్తరాది పేర్లను పెట్టుకుంటున్నామని స్టాలిన్ చెప్పుకొచ్కారు. ఆ అలవాటును మార్చుకోవాలని స్టాలిన్ తెలిపారు. దుకాణాలకు సైతం ఇది వర్తిస్తుందని ఆయన కామెంట్లు చేశారు. ఇంగ్లీష్ పేరు తప్పదనుకుంటే బోర్డుపై దానిని తమిళంలో రాయాలని ఆయన సూచనలు చేశారు. స్టాలిన్ చేసిన కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు సీఎం చేసిన సూచనలను ఆ రాష్ట్ర ప్రజలు పాటిస్తారో లేదో తెలియాల్సి ఉంది. స్టాలిన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. స్టాలిన్ రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. స్టాలిన్ అమలు చేస్తున్న పథకాలపై కూడా ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
స్టాలిన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. స్టాలిన్ ఇతర రాష్ట్రాల ప్రజలకు సైతం స్పూర్తిగా నిలిచే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సీఎం స్టాలిన్ భవిష్యత్తులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు