
దీంతో సుమారుగా పాకిస్తాన్లో 80 మంది పైగా ఉగ్రవాదులతో పాటు మరి కొంత మంది మరణించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కి ఇండియన్ ఆర్మీ దీటైన సమాధానాన్ని ఇస్తూ ఉన్నది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పలు రకాల దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తో పాటుగా పిఓకేలోని తొమ్మిది ఉగ్రసావరాల పైన దాడుకు చేయగా వాటన్నిటిని కూడా నాశనం చేసింది ఇండియన్ ఆర్మీ. దీంతో చాలామంది అధికారులు కూడా సపోర్టివ్ గా నిలుస్తూ ఉన్నారు. దీంతో ఆపరేషన్ సింధూర పేరిట నిర్వహించిన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సక్సెస్ గా కొనసాగింది.
దీంతో ఇప్పుడు తాజాగా భారత్ మరొక ఆపరేషన్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2 సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ఇటీవలే ప్రకటించింది. మరి సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ పని పట్టిన ఇప్పుడు భారత్ మరొకసారి రెండో ఆపరేషన్ కి సిద్ధమయ్యిందని విషయం తెలియడంతో పాకిస్తాన్ ఆర్మీ తో పాటు పాకిస్తాన్ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికే భారతీయు సైన్యం రక్షణ దళాలు నావి దళాలు అన్నీ కూడా చురుకుగా పాల్గొంటున్నాయని దీనివల్ల పాకిస్తాన్ సైన్యం కూడా దెబ్బతింటుందనే విధంగా అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనే విధంగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.