ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో పహల్గామ్ ఉగ్రదాడికి భార‌త్ ప్ర‌తికారం తీర్చుకోగా.. శ‌త్రుదేశం పాకిస్తాన్ ప‌నిగ‌ట్టుకుని యుద్ధానికి కాలు దువ్వింది. ఇండియాపై దాడులు షురూ చేసింది. సరిహద్దు వెంబడి కాల్పులకు తెగ‌బ‌డడంతో భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గ‌త రాత్రి 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లతో పాక్ దాడికి దిగ‌గా.. భారత త్రివిధ దళాలు పవర్ ఫుల్ ఆయుధాలతో వాటిని తిప్పికొట్టాయి. యుద్ధానికి సై అన్న పాక్ పై ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి చేస్తూ చుక్క‌లు చూపిస్తున్నాయి.


భారత్, పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధ వాతావరణం నెల‌కొన్న నేప‌థ్యంలో అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్.. దాయాది దేశాల మ‌ధ్య వివాదంతో త‌మ‌కు సంబంధం లేద‌ని, అందులో అమెరికా ఎట్టిప‌రిస్థితుల్లో జోక్యం చేసుకోద‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోవైపు పాకిస్తాన్‌కు సన్నిహిత మిత్రదేశమైన చైనా ఆప‌రేష‌న్ సింధూర్ ను ఆపాలంటూ విజ్ఞప్తి చేసింది. యుద్ధం ప్రారంభం కాక‌ముందు ర‌ష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా పరిస్థితిని మరింత దిగ‌జార్చే చ‌ర్యలను తీసుకోవద్దని ఇరు దేశాల‌ను కోరారు.


అయితే భార‌త్, పాక్ యుద్ధం నేప‌థ్యంలో నార్త్ కొరియా మద్దతుపై నెట్టింట జ‌రుగుతోంది. మా రేటే స‌ప‌రేటు అన్న చందంగా వ్య‌వ‌హ‌రించే నార్త్ కొరియా యుద్ధంతో ఏ దేశానికి స‌పోర్ట్ చేస్తుంది..? కిమ్ జాంగ్ ఉన్ మ‌ద్ద‌తు ఎవ‌రికి..? అన్న చ‌ర్య‌లు జోరుగా సాగుతున్నాయి. మెజారిటీ పీపుల‌ర్ ఇండియాకే కిమ్ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు 1962 నుంచి భార‌త్ తో నార్త్ కొరియా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్ల పాటు ఇరుదేశాల మ‌ధ‌య‌ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి. 2004లో ఇండియాను సునీమా అత‌లాకుత‌లం చేసిన‌ప్పుడు నార్త్ కొరియా భారీగా ఆర్థిక సాయాన్ని అందించింది. అలాగే క‌రోనా స‌మ‌యంలో నార్త్ కొరియాకు ఇండియా అండంగా నిల‌బ‌డింది.


ఇక పాక్ తో కూడా నార్త్ కొరియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ అది ఒక్క‌ప్పుడు. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కాబ‌ట్టి స‌పోర్ట్ అవ‌స‌రం అన్న‌ప్పుడు కిమ్ పాకిస్తాన్ వైపు క‌న్నా ఇండియా వైపు మొగ్గు చూపే అవ‌కాశాలే అధికంగా ఉన్నాయ‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: