
సజ్జన కుటుంబం అటవీ భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణలు రావడంతో అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇందుకు సంబంధించి విచారణ చేయించారు. అయితే అటవీశాఖ చేపట్టిన సర్వేలో సజ్జలకు అక్కడ అంత భూమి లేదంటు సర్వేలో తేలిందట. కానీ అక్కడ 55 ఎకరాల అటవీ భూమి ఉందని తేలడంతో వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ రోజున ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది.
సజ్జల కుటుంబం మొత్తం 63.72 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని.. ఇందులో 52.40 ఎకరాల భూమి ఫారెస్ట్దే అంటూ అధికారులు గుర్తించారట. కడప జిల్లాలో చింతకొమ్మదిన్నె లో ఉండేటువంటి సీకే దీన్నే మండలంలో..S.R నెంబర్ 1629 లో ఇందులో ఉన్నదని.. అక్కడ 11 ,000 ఎకరాల అటవీ భూమి ఉందని గుర్తించారట. అయితే అక్కడే సజ్జల కుటుంబానికి 146 ఎకరాల పట్టా భూమి ఉన్నదట.. ఈ భూమిలో సజ్జల రామకృష్ణారెడ్డి మేనల్లుడు సందీప్ రెడ్డి పేరు మీద 71.49 ఎకరాల భూమి. అలాగే జనార్దన్ రెడ్డి పేరు మీద 18.85 ఎకరాల భూమి ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద మిగిలిన భూమి కలదట. అయితే ఈ విషయం పై గతంలోని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మామిడి తోటలలో తనకు ఒక సెంటు భూమి కూడా లేదని.. 1995లో తమ సోదరులతో కలిసి భూమిని అయితే కొనుగోలు చేశాను పదేళ్ల తర్వాత వారికి ఇచ్చేసానంటూ తెలియజేశారు. తనకు ఆ భూములతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.