
ఈ కేసు వివరాలకు సంబంధించి హీస్సార్ ఎస్పీ మీడియాకు తెలియజేస్తూ జ్యోతి ఉగ్రవాద సంస్థతో కాని ఉగ్రవాదులతో కానీ తనకు సంబంధం ఉన్నట్లుగా ఇప్పటివరకు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆమె ఉగ్ర కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్లుగా కూడా ఎలాంటి సాక్షాలు కూడా లభించలేదంటు తెలియజేశారు. పాక్ నిగా వర్గాల అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గాని.. మతం మార్చుకోవాలని ఉద్దేశం కానీ ఆమెకు ఉన్నట్లు అందుకు సంబంధించి ప్రయత్నాలు చేసినట్లుగా కానీ ఎలాంటి ఆధారాలు తమకు లభించలేదని.. అయితే తాను మాట్లాడుతున్నది పాకిస్థాన్ గూఢచారి సంస్థకు చెందిన వారితో అని ఆమెకు తెలుసు అంటూ తెలిపారు.
అంతేకాకుండా భారత సాయుధ బలగాల వ్యూహాలు ప్రణాళికల గురించి ఆమెకు పెద్దగా ఎటువంటి అవగాహన ఉన్నట్లుగా కనిపించడం లేదంటూ హిస్సార్ ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని అలాగే జ్యోతి డైరీ ఒకటి వెలుగులోకి వచ్చిందని వార్తలు కేవలం రూమర్స్ అని తెలిపారు. జ్యోతి దగ్గర తాము ఎలాంటి డైరీ ని కూడా స్వాధీనం చేసుకోలేదని ఆమెకు చెందిన మూడు మొబైల్స్ ,ఒక ల్యాప్ టాప్,ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నామట్టు క్లారిటీ ఇచ్చారు. వాటిని మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తున్నామని అందుకోసం ప్రత్యేకించి ల్యాబ్ కు పంపించామంటూ తెలియజేశారు. ఎలాంటి విషయాలనైనా తామే అధికారికంగా చెబుతామని తెలిపారు.