
కేటీఆర్ మాట్లాడుతూ మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని కవిత లేఖ పెద్ద మ్యాటర్ కాదని అన్నారు. ఇంటర్నల్ విషయాలను పబ్లిక్ గా మాట్లాడటం సరి కాదని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో అందరం కార్యకర్తలమే అని అందరం సమానమే అని ఆయన వెల్లడించారు. అయితే పార్టీలో తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని కేటీఆర్ టార్గెట్ గా కవిత చెప్పారని సమాచారం అందుతోంది.
తండ్రిని దేవుడితో పోల్చిన కవిత అన్న గురించి మాట మాత్రమైనా ప్రస్తావించకపోవడంతో ఆమె మనస్సులో ఏముందో సులువుగానే అర్థమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సీఎం కవిత అంటూ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయో కూడా క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పవచ్చు.
లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యి జైలులో కొంతకాలం ఉండటం పార్టీకి తీరని నష్టం చేసిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు చోటు చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. కవిత వర్సెస్ కేటీఆర్ వివాదం మరింత ముదిరితే పార్టీకి రాబోయే రోజుల్లో తీరని నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు