
రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు ఏపీలోకి వచ్చే అవకాశం ఉందని జూన్ రెండో వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఈసారి మాత్రం ముందుగానే నైరుతి రుతు పవనాలు వచ్చాయి. 16 ఏళ్లలో అంచనాల కంటే రుతుపవనాలు ముందుగానే రావడం ఇదే తొలిసారి అని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ అయితే ఉందని భోగట్టా. మన దేశంలో 52 శాతం మంది వర్షాధారం ఆధారంగా వ్యవసాయం సాగు చేస్తుండటం గమనార్హం. వ్యవసాయ ఉత్పత్తిలో ఈ భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుంది. నైరుతి రుతు పవనాలు భారత ఆహార భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం.
దేశంలో తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడీపీ తోడ్పాట్లుకు ఎంతో ముఖ్హ్యం అని చెప్పవచ్చు. మరోవైపు అరేబియా సముద్రంలో అల్ప పీడనం బలపడి వాయుగుండంగా మారగా ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు కదులుతోంది. దీని ప్రభావంతో పశ్చితమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు